ప్రేమలో పడింది పిల్ల

రెజీనా ప్రేమలో మునిగి తేలుతున్నట్లు సినీవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. చెన్నైకి చెందిన రెజీనా కోలీవుడ్‌లో కంటే టాలీవుడ్‌లోనే మంచి పేరు తెచ్చుకుంది. మొదట్లో పలు టీవీ కార్యక్రమాల్లో వ్యాఖ్యాతగా వ్యవహరించి, ఆ తరువాత వాణిజ్య ప్రకటనల్లో మెరిసింది. ఆపై రెజీనా కోలీవుడ్‌ తెరకు పరిచయమైంది. కండనాళ్‌ మొదల్‌ చిత్రంతో హీరోయిన్‌గా 2012 తెరపైకి వచ్చిన రెజీనా ఆ చిత్రం ప్రేక్షకుల ఆదరణను పొందినా, ఆ తరువాత నటించిన చిత్రాలేవీ పెద్దగా సక్సెస్‌ కాలేదు. దీంతో టాలీవుడ్‌పై దృష్టిసారించి వరుసగా అవకాశాలను చేజిక్కించుకుంటోంది. అయితే కోలీవుడ్‌లో ఆ మధ్య నటించిన మానగరం చిత్రం ఈ అమ్మడి ఖాతాలో హిట్‌గా నిలిచింది. దీంతో ఇక్కడ అవకాశాలు తలుపు తడుతున్నాయి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com