ప్రేమ దొరికింది

సినిమా రంగంలో హీరోలు హీరోయిన్లమధ్య ప్రేమాయణాలు సర్వసాధారణమే. ఇప్పటికే ఎన్నో ప్రేమకథలను వినే వున్నాం. తాజాగా మరో బాలీవుడ్ భామ ఓ హీరోతో ఘాటు ప్రేమాయణం సాగిస్తోందన్న వార్త హల్‌చల్ చేస్తోంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే, హాట్ హాట్ అందాలతో షాక్‌లిచ్చే అతిథిరావు హైదరి. ఈ భామ కొన్ని రోజులుగా పర్హాన్ అక్తర్‌తో ప్రేమాయణం సాగిస్తోందట. ఇద్దరూ కలిసి వజీర్ సినిమా చేసినప్పటినుంచీ సాన్నిహిత్యం బాగా పెరిగిందని, ఘాటు లవ్‌లో ఉన్నారని బాలీవుడ్ అంటోంది. ఎక్కడికి వెళ్లినా కలిసే వెళుతున్నారట. మణిరత్నం ‘చెలియా’ సినిమాతో ఫామ్‌లోకి వచ్చిన ఈ అమ్మడిపై వస్తున్న రూమర్లు గురించి అడిగితే మాత్రం తన కో స్టార్ కనుక సరదాగా మాట్లాడుకుంటామని, అంత మాత్రాన ఇద్దరిమధ్య ఏదో వున్నట్టేనా అని రివర్స్ కౌంటర్ వేసింది. ఇలాంటి వ్యవహారాలు ఉన్నాయని అంటే ఏ హీరోయిన్ మాత్రం ఔను అంటుంది. తాజాగా ఈ అమ్మడు సుధీర్‌బాబు సరసన ఓ సినిమాలో నటించనుంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com