ప్లీజ్…ఒక ఇరవై కోట్లు ఇవ్వండి.

ప్రధాని నరేంద్రమోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ భేటీ ముగిసింది. సుమారు 50 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో విభజన చట్టం హామీలతో పాటు రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న పలు ప్రాజెక్టులకు సంబంధించి 10 అంశాలతో కూడిన వినతిపత్రాన్ని ప్రధానికి కేసీఆర్‌ అందజేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు త్వరితగతిన అనుమతులు ఇచ్చినందుకు మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం కేంద్రం నుంచి రూ.20వేల కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. కొత్త జోనల్‌ వ్యవస్థకు అనుగుణంగా రాష్ట్రపతి ఉత్తర్వులు సవరించాలని, రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని, మనోహరాబాద్‌-కొత్తపల్లి, అక్కన్నపేట-మెదక్‌ రైల్వే లైన్లను త్వరగా పూర్తిచేయాలని, కాజీపేట-కరీంనగర్‌ మధ్య రైల్వేలైన్‌ కోసం సర్వే చేయాలని, కొత్త సచివాలయం నిర్మాణానికి బైసన్‌ పోలో మైదాన స్థలాన్ని కేటాయించాలని, విభజన చట్టంలోని 9 వెనుకబడిన జిల్లాల(ఉమ్మడి జిల్లాలు) అభివృద్ధికి సహకరించాలని, రాష్ట్రానికి ఐఐఎం మంజూరు చేయాలని, హైదరాబాద్‌లో ఐటీఐఆర్‌ ప్రాజెక్టుకు చేయూత అందించాలని, జవహర్‌ నవోదయ విద్యాలయాల సంఖ్య పెంచాలని కేసీఆర్‌.. ప్రధానిని కోరారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com