ఫలమే బలం

పళ్లలోని పోషకాలు వేర్వేరు రుగ్మతలను అరికడతాయి. అయితే ఎలాంటి రుగ్మతకు ఎలాంటి పండు తినాలో అవగాహన ఏర్పరుచుకోవాలి. అందుకోసం వేర్వేరు పళ్లలోని వేర్వేరు పోషకాల గురించి తెలుసుకుందాం!
*అరటి
దీన్లో ఉండే అత్యధిక పొటాషియం అధిక రక్తపోటును తగ్గిస్తుంది.
*యాపిల్‌
దీన్లోని అత్యధిక యాంటీఆక్సిడెంట్‌ ఫ్లేవనాయిడ్స్‌ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించి మధుమేహం నుంచి రక్షణ కల్పిస్తుంది.
*అవకాడో
దీన్లోని మోనోశాచురేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్లు రక్తంలో కొలెస్ట్రాల్‌ స్థాయిలను క్రమబద్ధీకరిస్తాయి.
*ద్రాక్ష
నల్లద్రాక్షల్లో ఉండే రెస్‌వెరట్రాల్‌ అనే యాంటీఆక్సిడెంట్లు రక్తపోటును నియంత్రించి గుండె జబ్బులు రాకుండా రక్షణ కల్పిస్తాయి.
*మమిడి
వీటిలోని జాక్సాంథిన్‌ యాంటీఆక్సిడెంట్లు కంటిచూపును మెరుగుపరిచి పెద్దల్లో అంథత్వం రాకుండా చేస్తాయి.
*ఆరెంజ్‌
దీన్లోని ఫైటో కెమికల్స్‌ రక్తంలోని కొలెస్ట్రాల్‌ స్థాయిలను నియంత్రిస్తాయి.
*కివి
దంతాలు, ఎముకలు, మృదులాస్థి పెరగడానికి ఈ పండు దోహదపడుతుంది. ఈ పండు గుండె జబ్బులను నివారిస్తుంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com