ఫలాలు ఉదయం మంచివే

మన రెగ్యులర్‌ డైట్‌లో ఉదయం పండ్లు తీసుకోవడం చాలా అవసరం. పండ్లు తినడానికి వయసుతో పనిలేదు. అన్ని రకాల పండ్లను అన్ని వయసుల వారు తీసుకోవచ్చు. ఎందుకంటే పండ్లు ఆరోగ్యంగా ఉంచుతాయి. మొత్తానికి పండ్లు మనకు ఎనర్జీ బూస్టర్స్‌గా సహాయపడతాయి. ముఖ్యంగా వీటిని ఉదయం తీసుకుంటే ఆ రోజంతా మనల్ని ఉత్సాహంగా ఉంచుతాయి.ప్రతి రోజూ ఉదయం ఒక ఆపిల్‌ తినడం వల్ల అది ఎనర్జీని అందిస్తుంది. ఆపిల్‌, ఆరెంజ్‌, అరటిపండు ఉదయం పూట తీసుకోవడం చాలా మంచిది. పండ్లలో కార్బోహైడ్రేట్స్‌ అధికంగా ఉండటం వల్ల రోజంతా పని చేయడానికి అవసరమైన శక్తిని అందిస్తాయి.
*జీర్ణక్రియను మెరుగు
పండ్లు క్లీనింగ్‌ ఫుడ్స్‌గా చెప్పవచ్చు. ముఖ్యంగా ఉదయం వీటిని తినడం వల్ల శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు నెట్టివేస్తాయి. అంతే కాదు, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. రోజంతా మరింత ఉత్సాహంగా ఉండేందుకు సహాయపడతాయి.
*ఎంజైమ్స్‌ ఎక్కువ
వీటిలో ఎంజైమ్స్‌ ఎక్కువగా ఉండటం వల్ల ఆహార నిపుణులు ఉదయాన్నే పండ్లను తీసుకోవాలని సలహాలిస్తుంటారు. ఈ ఎంజైమ్స్‌ శరీరంలోని వివిధ రకాల జీవక్రియలు పనిచేయడానికి సహాయపడతాయి. తిన్న ఆహారం నేచురల్‌గా జీర్ణం కావడానికి సహాయపడతాయి.
*ఉల్లాసంగా
రోజులో ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకోవడం కంటే, వాటి స్థానంలో కొద్దిగా పండ్లు తీసుకుంటే అవి శరీరానికి నేచురల్‌ గ్లూకోజ్‌ను అందిస్తాయి. ఇవి మరింత ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండటానికి సహాయపడతాయి. ఎందుకంటే వీటిలో నేచురల్‌ షుగర్స్‌, ఫైబర్‌ ఉండటం వల్ల మానసిక శక్తిని అందిస్తాయి.
*ఒత్తిడి తగ్గిస్తాయి
విటమిన్‌- సి అధికంగా ఉండే పండ్లను ఉదయం తీసుకుంటే, ఒత్తిడి తగ్గించడానికి సహాయపడతాయి.
*హైడ్రేషన్‌
ఉదయం పండ్లు తీసుకోవడం వల్ల శరీరం రోజంతా హైడ్రేషన్‌లో ఉంటుంది. నేచురల్‌గానే డీహైడ్రేషన్‌ సమస్యను నివారిస్తుంది.ప్రతి రోజూ ఉదయం పండ్లు తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలను పొందవచ్చు. త్వరగా బరువు తగ్గించడంలో కూడా ఇవి బాగా సహాయపడతాయి. వీటిలో నేచురల్‌ షుగర్స్‌, తక్కువ క్యాలరీలు ఉండటం వల్ల ఎనర్జీలెవల్స్‌ ఎక్కువగా అందిస్తాయి

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com