ఫోన్లు అవతల పారేయండి

అండర్‌-19 భారత యువ క్రికెటర్లకు కోచ్ రాహుల్‌ ద్రవిడ్‌ తమ ఫోన్లు స్విచ్ఛాఫ్‌ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశాడట. ఇదంతా వారి కోసమే. ఎందుకంటే శనివారం ఐసీసీ అండర్‌-19 ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. ఫైనల్లో భారత్‌-ఆస్ట్రేలియా తలపడనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆటగాళ్ల ఏకాగ్రత దెబ్బతినకుండా ఉండేందుకు అండర్‌-19 భారత జట్టు కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ ఫైనల్‌ ముగిసే వరకూ ఫోన్లు స్విచ్ఛాఫ్‌ చేయాల్సిందిగా ఆటగాళ్లకు ఆదేశాలు జారీ చేశాడట. ద్రవిడ్‌ ఇలా ఆటగాళ్లకు ఆదేశాలు జారీ చేయడం ఇదే తొలిసారి కాదు. మొన్నటికి మొన్న ఐపీఎల్‌ వేలం సమయంలోనూ వారికి క్లాస్‌ పీకిన సంగతి తెలిసిందే. ‘ఐపీఎల్‌ కోసం వేలం ఏటా నిర్వహిస్తారు. అండర్‌-19 ప్రపంచకప్‌లో ఆడే అవకాశం మాత్రం రెండేళ్లకు ఒకసారి మాత్రమే వస్తుంది. ఆటపై దృష్టి పెట్టండి’ అని ద్రవిడ్‌ ఆటగాళ్లను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశాడు. ఆటగాళ్లు ఫోన్లు వాడుతూ ఉంటే వారి ఏకాగ్రత దెబ్బతింటుందని, ఒత్తడికి గురవుతారని భావించే ద్రవిడ్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని పలువరు హర్షం వ్యక్తం చేశారు. ‘పాక్‌తో సెమీఫైనల్‌ అనంతరం మా కుమారుడు శివమ్‌ మావితో మాట్లాడదామని ప్రయత్నించాను. కానీ, ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ వచ్చింది. గత ఆదివారం చివరి సారిగా శివమ్‌తో మాట్లాడాను. ప్రధాన మ్యాచ్‌లకు ముందు ఫోన్లు వాడొద్దని ద్రవిడ్‌ ఆదేశాలు జారీ చేసినట్లు అప్పుడే శివమ్‌ మాతో చెప్పాడు’ అని శివమ్‌ తండ్రి పంకజ్‌ మావి తెలిపారు. భారత్‌-ఆస్ట్రేలియా మధ్య శనివారం ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో భారత్‌.. ఆసీస్‌పై విజయం సాధించిన సంగతి తెలిసిందే. భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం 6.30గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌లో మ్యాచ్‌ ప్రత్యక్ష ప్రసారం కానుంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com