ఫ్లిప్‌కార్ట్‌లో వాటాల కోసం

భారత్‌కు చెందిన ఈ-కామర్స్‌‌ పోర్టల్‌ ఫ్లిప్‌ కార్టులో వాటాలు కొనుగోలు చేసేందుకు అమెరికా రిటైల్‌ దిగ్గజం వాల్‌-మార్ట్‌ స్టోర్‌ ఐఎన్‌సీ చర్చలు జరుపుతోంది. ఫ్లిప్‌కార్ట్‌లో దాదాపు 20శాతం వాటా కొనుగోలకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఫ్లిప్‌కార్టులో ఉన్న వాటాదారుల వద్ద నుంచి ప్రైమరీ, సెకండరీ సేల్‌ విధానంలో షేర్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ డీల్‌ మార్చి తొలి వారంలో పూర్తి కావొచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ వార్తలపై తాము స్పందించమని వాల్‌మార్ట్‌ ప్రతినిధి రాన్డీ హర్‌గ్రోవ్‌ తెలిపారు. రెండేళ్ల క్రితం ఫ్లిప్‌కార్టులో దాదాపు బిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెట్టేందుకు వాల్‌మార్ట్‌ సిద్ధమైంది. కానీ ఆ తర్వాత డీల్‌ ముందుకు జరగలేదు. తాజాగా మళ్లీ చర్చలు జరుగుతున్న విషయం బయటకు వచ్చింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com