బడి శిక్షల్లో కొత్తరకం – వేపాకు రసం తాగించడం….

దండించకుండా పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టడానికి ఓ కొత్త విధానాన్ని ఎంచుకుంది సూరత్‌కి చెందిన ఓ పాఠశాల. అవడానికి అది పిల్లలకు పెద్ద పనిష్‌మెంటే అయినా వారి ఆరోగ్యానికి మేలు చేసేదే కావడం విశేషం. అదాజన్‌ ప్రాంతంలోని విద్యాకుంజ్‌ పాఠశాల ప్రిన్సిపల్‌ క్రమశిక్షణ లేని విద్యార్థులకు బుద్ధిచెప్పడానికి వేపరసం ఇస్తున్నారు. విద్యార్థులు మాటవినకపోతే వారికి ఓ కప్పు వేపాకు రసం ఇచ్చి ఒకేసారి తాగమంటారు. కొట్టి పిల్లల్ని బాధపెట్టేకంటే ఇదే నయమని, వేపాకు రసం చేదుగా ఉంటుంది కాబట్టి అదితాగలేక అల్లరి చేయకుండా బుద్ధిగా ఉంటారని పాఠశాల ప్రిన్సిపల్‌ మహేశ్‌ పటేల్‌ తెలిపారు. గత 20 రోజులుగా తాము ఈ విధానాన్ని అవలంబిస్తున్నామన్నారు. చేదు చాలావరకు తగ్గించడానికి వేపాకు రసానికి నీరు కలుపుతున్నామన్నారు. కొంతమంది తప్పు చేసిన విద్యార్థులు నేరుగా తమ తప్పు ఒప్పుకొని వేపాకు రసం తాగుతున్నారని, మరికొందరు తాగాల్సి వస్తుందన్న భయంతో బుద్ధిగా ప్రవర్తిస్తున్నారని, క్రమం తప్పకుండా హోంవర్క్‌ చేస్తున్నారని ఆయన చెప్పారు. ఎన్నో ఔషధగుణాలున్న వేపాకు రసాన్ని తాను రోజూ తాగుతానని తన పాఠశాలలో చదివే విద్యార్థులకు కూడా ఈ జ్యూస్‌ ఇస్తే తప్పు చేసినందుకు శిక్ష విధించినట్లూ ఉంటుంది ఆరోగ్యంగానూ ఉంటారని ఈ ఆలోచన చేశానని ప్రధానోపాధ్యాయులు చెప్పారు. పాఠశాలలో అమలు చేస్తున్న ఈ కొత్త విధానం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com