బతిమిలాడుతున్న పంజాబ్ బ్యాంకు

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును రూ.11,400 కోట్ల మేర ముంచి దేశం విడిచి పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీకి ఆ బ్యాంకు మరో ఆఫర్‌ ఇచ్చింది! మోస పూరితంగా తీసుకున్న లెటర్‌ ఆఫ్‌ అండర్‌ టేకింగ్‌ (ఎల్‌వోయు)ల ద్వారా తమ శాఖలకు వాటిల్లిన నష్టాలను పూడ్చేందుకు సమగ్ర, అమలు చేయదగిన ప్రణాళికతో తిరిగి రావాలని సూచించింది. అప్పులు చెల్లించే స్థితిలో లేనని తన ప్రతిష్ఠను మసక బార్చారని, పరువు బజారుకీడ్చారని నీరవ్‌ మోదీ పంపిన ఈ-మెయిల్‌కు బదులుగా బ్యాంకు ఈ విధంగా బదులిచ్చిందని కొన్ని వర్గాల ద్వారా తెలిసింది. ‘బ్యాంకులోని కొందరు అధికారుల ద్వారా మోసపూరితంగా, అన్యాయంగా మీరు ఎల్‌వోయూలు పొందారు. మీ మూడు భాగస్వామ్య సంస్థలకు మేమిప్పుడు అవకాశాలు పొడిగించే స్థితిలో లేం’ అని పీఎన్‌బీ జనరల్‌ మేనేజర్‌ (అంతర్జాతీయ బ్యాంకింగ్‌ విభాగం’ అశ్విన్‌ వత్స్‌ నీరవ్‌ మోదీకి బదులిచ్చారని తెలిసింది. ‘మీరు తీసుకున్న భారీ అప్పులు తిరిగి చెల్లించేందుకు గడువులు పొడగించేందుకు మేం సహకరించలేం. అయితే అప్పులు చెల్లించేందుకు మీరు ఏదైనా అమలు చేయగల సమగ్ర ప్రణాళికతో రాగలరా! అలాగైతే మాకు తిరిగి మెయిల్‌ చేయండి’ అని బ్యాంకు నీరవ్‌ మోదీకి మెయిల్‌ చేసింది. నీరవ్‌ మోదీ అవినీతి, అక్రమ బాగోతాలు బయటపడటంతో సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. ఆయనపై ఫెమా, మనీ లాండరింగ్‌ వ్యతిరేక చట్టాలను ఉల్లంఘించారని కేసులు పెట్టింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com