బఫెట్ బిజినెస్ సూక్తులు

పెట్టుబడి మాంత్రికుడిగా ప్రపంచ కార్పొరేట్‌ రంగంలో తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న వారెన్‌ బఫెట్‌ గురించి ఇప్పుడు కొత్తగా చెప్పేదేమీ ఉండకపోవచ్చు. అలాగే ఆయన ఎప్పుడూ చెప్పే సూత్రాలూ కొత్తవి కాకపోవచ్చు. కానీ, ఎప్పటికీ అవి ఆణిముత్యాలే. అంతకుమించి అక్షరసత్యాలే. ఆయన ఎక్కడ, ఏ సమావేశంలో ప్రసంగించినా ఏవో కొన్ని సలహాలు, సూచనలు ఇస్తూనే ఉంటారు. ఆయన చెప్పే సూక్తి ముక్తావళి ఎవరికైనా ఆచరణీయమే. భవిష్యత్తుకు చక్కటి ఆర్థిక పునాది వేసుకోవడానికి ఉపయుక్తమైన బఫెట్‌ ఆణిముత్యాల్లో కొన్ని ఇవి…

* జీవితంలో మనం రెండు నియమాలు పాటించాలి. ఒకటి ఎప్పుడూ డబ్బులు పోగొట్టుకోకూడదు. ఇది మొదటిది. ఇక రెండోది.. మొదటి నియమాన్ని ఎప్పుడూ మరిచిపోకపోవడమే..
* తక్కువ ధరకు ఓ అద్భుతమైన కంపెనీని కొనుగోలు చేయాలి కానీ.. అద్భుతమైన ధరకు ఓ మామూలు కంపెనీని కొనుగోలు చేయకూడదు.
* పదేళ్లపాటు నువ్వు స్టాక్‌ మార్కెట్‌ జోలికి వెళ్లకపోయినా కూడా నీదగ్గరున్న షేర్ల విషయంలో నిశ్చింతగా, హాయిగా ఉండగలిగే షేర్లను మాత్రమే నువ్వు ఎంపిక చేసుకోవాలి..
* పదేళ్లపాటు ఒక షేరును అట్టేపెట్టుకోవాలనే ఆలోచనే నీకు లేనప్పుడు, పది నిమిషాలు కూడా ఆ షేరును నీ దగ్గర ఉంచుకునే ఆలోచన చేయకు.
* నేను ధనవంతుడ్ని అవుతానని నాకు తెలుసు. ఈ విషయంలో నాకు ఏ క్షణంలోనూ సందేహం కలగలేదు.
* నీపైన నీకు నమ్మకం కలిగిఉండటమే నువ్వు పెట్టే అత్యంత ముఖ్యమైన పెట్టుబడి.
* షేర్లయినా.. కాలికి తొడుక్కునే సాక్సులయినా తక్కువ ధరకు దొరుకుతున్నాయి కదా అని ఎగబడను.. అవి నాణ్యమైనవయితేనే కొనేందుకు ఇష్టపడతాను.
* ఒకటే ఆదాయం మార్గంపై ఎన్నడూ ఆధారపడకూడదు. రెండో ఆదాయ వనరును సృష్టించేందుకు పెట్టుబడి పెట్టు.
* నీకు అవసరం లేని వస్తువులను ఇప్పుడు నువ్వు కొంటే.. త్వరలో నీకు అవసరమైన వస్తువులను నువ్వు అమ్ముకోవాల్సి వస్తుంది.
* నువ్వు ఏం చేస్తున్నావో తెలియకపోతేనే నష్టం వస్తుంది. అందుకే నీకు ఏ వ్యాపారమైనా అర్థంకాకపోతే ముందు దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాకే పెట్టుబడులు పెట్టాలి.
* ఖర్చు పెట్టాక మిగిలిన డబ్బులను పొదుపు చేయడం కాదు.. పొదుపు చేశాక మిగిలిన డబ్బులను ఖర్చు పెట్టు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com