బరువు తగ్గడం వేసవిలోనే సులువు

మిత్రులారా ! ఇది వేసవి సమయం, అంటే ఒక సంవత్సరకాలంలో చల్లని పానియాలను & తేలికపాటి వస్త్రాలను ఉపయోగించి, అధిక వేడిని తట్టుకోవాల్సిన సమయమని అర్థం. వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా భారతదేశం వంటి ఉష్ణమండల ప్రదేశాలలో వేడి పెరుగుతుంది, ఇలాంటి సమయంలోనే చాలామంది నీటిలో పూర్తిగా మునగవచ్చు (లేదా) సముద్ర తీర ప్రాంతాలకు వెళ్లి సేద తీరవచ్చు. దేశంలో ఉన్న కొన్ని ప్రాంతాలలో వేడి ఎక్కువగా ఉండటంతో మీరు తీవ్రమైన తేమను కలిగి ఉండవచ్చు, ఇదే ‘చెమట’గా వ్యవహారించబడుతుంది ! కాబట్టి, ఇలాంటి పరిస్థితుల్లోనే చాలామంది ప్రజలు సాధారణంగా పలుచగా, తేలికగా ఉన్న దుస్తులను ఉపయోగించాలనుకుంటారు. అలాగే స్విమ్మింగ్ పూల్‌లో స్విమ్సూట్లను (లేదా) బికినీలను ధరించడం వల్ల మీ శరీరాన్ని త్వరగా చల్లబరుస్తుంది. అయినప్పటికీ, చాలామంది ప్రజలు వారి శరీరంలో ఉన్న అదనపు కొవ్వు ఉందని గ్రహించగలిగారు, కాబట్టి వేసవికాలంలో వారికి తగిన దుస్తుల వాడకాన్ని నిరోధించవచ్చు. మీ చర్మముతో, మీరు మరింత సౌకర్యవంతంగా ఉండటమనేది చాలా ముఖ్యమైనప్పటికీ, అధిక బరువు (లేదా) ఊబకాయం వంటివి ఆ వ్యక్తి యొక్క స్వీయ-విశ్వాసాన్ని (సెల్ఫ్-కాన్ఫిడెన్స్) తగ్గించడమే కాకుండా, ఆరోగ్య ప్రమాదాలకు కూడా కారణమవుతుంది. కాబట్టి, మీరు బరువును తగ్గించుకునే ప్రయత్నం చేయటం చాలా ముఖ్యం, దీనివల్ల మీరు వేసవి కాలానికి తగిన మంచి శరీరాన్ని కలిగి ఉండటమే కాక, ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి కూడా అనుకూలంగా ఉంటుంది. మీరు ఈ వేసవిలో, బరువు కోల్పోవడానికి సహాయపడే కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి !

1. సూప్ తాగండి : శీతాకాలంలో మనల్ని మనం వెచ్చగా ఉంచుకోవడానికి మనలో చాలామంది ఒక కప్పు రుచికరమైన వేడి సూప్‌ను తాగడానికి ఇష్టపడతారు. అయితే, మీరు తీసుకునే ఆహారంలో వెజిటేబుల్ సూప్ (లేదా) లీన్ చికెన్ సూప్‌లను ఒక భాగంగా చేసుకోవడం వల్ల మీరు తీసుకునే ఆహార పరిమాణమును తగ్గించడమే కాకుండా, మీ శరీర బరువును తగ్గించేలా కూడా ఉంటుంది. పోషకాలను గొప్పగా కలిగి ఉన్న వేడి సూపులు మీ బరువును తగ్గించి & మీ జీవక్రియ రేటును పెంచడంలో మరింతగా సహాయపడుతుంది.

2. మెడిటెర్రేనియన్ డైట్ : మీరు త్వరగా బరువు కోల్పోవడాన్ని & వేసవికి అనుకూలంగా ఉండే శరీరాకృతిని పొందాలని కోరుకుంటే, మీకు ఏ మాత్రం హాని చేయని మెడిటెర్రేనియన్ డైట్‌ను ప్రయత్నించండి! ఈ డైట్లో తాజా కూరగాయలు, లీన్ మాంసం, ఆలివ్ నూనెతో చేసిన ఆహారాలు, చిక్పా హుమ్ముస్ వంటి మొదలైన ఆహారాలను మీ డైట్లో భాగంగా ఉండటం వల్ల, ఇది చాలా సమతుల్యతను కలిగి, తక్కువ కొవ్వును కలిగి ఉంటుంది ! కాబట్టి మీరు మెడిటెర్రేనియన్ డైట్‌ను ఒక నెలరోజులు ఫాల్లో అవ్వడం వల్ల, అది మీ శరీర బరువులో భారీ వ్యత్యాసాన్ని తీసుకురావచ్చు.

3. ఫ్రూట్ జ్యూసులను మానివేయండి : వేసవిలో వేడిని తట్టుకుని, మనల్ని మనం హైడ్రేడ్‌గా ఉండటం కోసం తరచుగా చల్లని పండ్ల రసాలను తీసుకుంటూ ఉంటాం. అయితే, చాలా పండ్ల రసాలలో చక్కెర మోతాదును ఎక్కువగా కలిగి ఉంటాయి & మీ బరువును కోల్పోయేలా చేయటంలో అది మీకు అడ్డంకిగా ఉండవచ్చు. కాబట్టి, మీరు పండ్ల రసాల బదులు పూర్తిగా నీటితో నిండిన కొబ్బరినీరును, వాటర్‌ను & ప్రూట్స్ వంటి ఇతర ఆరోగ్యకరమైన పదార్థాలను వినియోగించవచ్చు.

4. ఆల్కహాల్‌కు దూరంగా ఉండండి : వేడిని, ఒత్తిడిని తగ్గించుకోడానికి, మనలో చాలామంది వేసవికాలంలో ఒక చల్లటి బీరును (లేదా) ఆల్కహాలిక్ కాక్‌టైల్‌ను సేవించాలనుకోవటం చాలా సాధారణమైనది. అయితే, ఇవి ఇతర ఆరోగ్య సమస్యలను కలక చేయడమే కాకుండా, మీ జీవక్రియ సామర్థ్యాన్ని తగ్గించగలదు & మీ శరీర బరువును తగ్గించలేదు. ఆల్కహాల్ కూడా కేలోరిక్ కంటెంట్లను ఎక్కువగా కలిగి ఉంటుంది, కాబట్టి అది వేసవిలో మీరు కోరుకున్న అనుకూలమైన శరీరాకృతికి బదులుగా, మీ శరీర బరువును మరింతగా పెంచడంలో సహాయపడుతుంది.

5. స్వీయ నియంత్రణ కలిగిన వ్యాయామము : వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా మన శరీరం అధిక చెమటను ఉత్పత్తి చేయటం వల్ల, మనము చాలా శక్తిని కోల్పోవడం వల్ల, తరచుగా ఆకలిని కలిగి ఉంటాము. కాబట్టి మనము తరచుగా అనేక సార్లు ఆహారమును తీసుకుంటూ ఉంటాము. ఈ విధంగా మన శరీర బరువు పెరగటానికి కారణమవుతుంది. కాబట్టి, మీరు ప్రణాళికతో కూడిన డైట్‌ను పాటిస్తూ, మరోపక్క స్వీయ-నియంత్రణను కొన్ని వ్యాయామాలను అనుసరించడం చాలా అవసరం.

6. వేసవి దుస్తులను ధరించండి : మీరు బరువు తగ్గాలని ప్రయత్నాల్లో ఉన్నప్పుడు, పూర్తిగా బరువు తగ్గే వరకు వేచి ఉండకుండా, స్కర్ట్స్, షార్ట్స్‌ను, బికినీలను ధరించడం ప్రారంభించండి. ఒక అధ్యయనం ప్రకారం, ఇలాంటి అలవాట్ల వల్ల ఒక వ్యక్తి తన బరువును తగ్గించుకోవడంలో ప్రేరణను కలిగి, మరింత ఎక్కువగా శ్రమిస్తారని తెలుపబడింది. వారు కోరుకున్న బట్టలను వారు ధరిస్తూ ఉండటంవల్ల, బరువును కోల్పోవాలని ఆసక్తిని ఎల్లప్పుడూ కలిగే ఉంటారు.

7. వ్యాయామాలను మానవద్దు : ఈ వేసవికాలంలో, ఫిట్నెస్ ఔత్సాహికులు కూడా వ్యాయామాలకు దూరంగా ఉండటానికి ఇష్టపడతారు, ఎందుకంటే వేడి & చెమటతో వ్యాయామం చేయడం చాలా కష్టమవుతుంది, కాబట్టి కొత్తగా వ్యాయామాలను ప్రారంభించేవారికి ఇది ఎలాంటి అనుభవాన్ని కలిగిస్తుందో మీరు ఊహించవచ్చు! అయినప్పటికీ, మీరు వేడిని గురించి ఆలోచిస్తూ ఉండటం గూర్చి మానేసి, క్రమం తప్పకుండా వ్యాయామాలను చెయ్యటంలో బాగా మీరు నిమగ్నమై ఉంటే, మంచి ఫలితాలను పొందుతారు! 8. స్నాక్స్‌గా ఫ్రూట్ సలాడ్లు : వేసవికాలంలో వేడిని తట్టుకోవడానికి, శరీరానికి చల్లదనాన్ని కలిగించే వెగ్గీస్ / ఫ్రూట్స్‌తో రుచికరంగా చేసిన సలాడ్లు బాగుంటాయి ! ఈ అల్పాహారం ఆరోగ్యకరమైనది మాత్రమే కాదు, అది మీ శరీరబరువును తగ్గించే ప్రక్రియను మరింత వేగవంతం చేస్తుంది, ఎందుకంటే పండు & కూరగాయలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మీ జీవక్రియ రేటును పెంచుతాయి. అందువల్ల, మీరు వేసవిలో ఆకలి వేదనలను కలిగి ఉన్నప్పుడు, ఫ్రూట్ సలాడ్‌ను ఎంచుకోండి !

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com