బళ్ళారి పార్లమెంట్ సభ్యుడికి వైట్ హౌజ్ ఆహ్వానం

కర్ణాటకలోని బళ్లారి లోక్‌సభ సభ్యుడు శ్రీరాములును అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తమ దేశానికి ఆహ్వానించారు. అమెరికా అధ్యక్షుడిగా ఎవరైనా గెలిచాక 130 దేశాల ప్రముఖులను ఆహ్వానించి ఆ దేశ సంప్రదాయాల ప్రకారం విందు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలోనే ఈ నెల 7, 8 తేదీల్లో విందు ఏర్పాటు చేసిన డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ కార్యక్రమాల్లో పాల్గొనే ప్రముఖల జాబితాలో భారతదేశం నుంచి ఇద్దరు నేతలను ఎంపిక చేశారు.వీరిలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ ఒకరు కాగా, బళ్లారి ఎంపీ శ్రీరాములు మరొకరిగా ఉన్నారు. వీరిద్దరికీ ఇప్పటికే వైట్‌హౌస్‌ నుంచి ఆహ్వానాలు అందినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడు తనను ఆహ్వానించడం మరిచిపోలేని సంఘటన అని తెలిపారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com