బాగా ఆడాడు

గత ఒలింపిక్స్‌లో పోటీపడలేకపోవడం నుంచి వచ్చిన కసో, 2020 ఒలింపిక్స్‌కు ముందు తనలో చేవ తగ్గలేదని చాటి చెప్పాలనే తపనో.. పట్టుదలను పదింతలు చేసిన పరిణామాలు ఏవైతేనేం..! దేశంలో రెజ్లింగ్‌ విప్లవం తెచ్చిన కుస్తీ యోధుడు సుశీల్‌ కుమార్‌ చెలరేగిపోయాడు. కామన్వెల్త్‌లో క్రీడల్లో ఉడుంపట్టుతో అలవోకగా స్వర్ణం పట్టేశాడు. ఈ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ జోరుకు ఎదురేలేకపోయింది. కనీస పోటీ ఇవ్వలేక ప్రత్యర్థులంతా తేలిపోయారు. ఫైనల్‌ ప్రత్యర్థిని అయితే సుశీల్‌ కేవలం 80 సెకన్లలోనే మట్టికరిపించాడు. కామన్వెల్త్‌ క్రీడల్లో అతడికిది వరుసగా మూడో స్వర్ణం. సుశీలే కాదు రెజ్లింగ్‌ పోటీల తొలి రోజు రాహుల్‌ అవారె కూడా భారత్‌కు పసిడి పతకం అందించాడు. బబిత ఫొగాట్‌ రజతంతో సరిపెట్టుకుంది. అథ్లెటిక్స్‌లో సీమా పునియా రజతం అందించింది. షూటర్‌ తేజస్విని సావంత్‌ కూడా వెండి పతకం సాధించింది. గురువారం మొత్తంగా ఏడు పతకాలు సొంతం చేసుకున్న భారత్‌.. 14 స్వర్ణాలు సహా 31 పతకాలతో పతకాల పట్టికలో మూడో స్థానాన్ని నిలబెట్టుకుంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com