బాన బొజ్జలు కరగట్లేదా? ఇవిగో చిట్కాలు.

వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చే ఆరోగ్య సమస్యల్లో స్థూలకాయం ఒకటి. అందులో పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోవడాన్ని ప్రధాన సమస్యగా చెప్పుకోవచ్చు. మరి దీన్ని తగ్గించుకోవడానికి ఎలాంటి పద్ధతులు పాటించాలో చూద్దామా! అమితంగా తినడం, ఎక్కువసేపు కదలకుండా కూర్చోవడం వల్ల పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. మరి దాన్ని తగ్గించాలంటే తక్కువ ఆహారాన్ని ఎక్కువసార్లు తీసుకోవాలి. ముఖ్యంగా చిప్స్‌, వేపుళ్లూ, పేస్ట్రీలూ, శీతలపానీయాల్లాంటివాటిని తగ్గించాలి. తాజా కాయగూరలూ, పండ్లకు ప్రాధాన్యం ఇవ్వాలి. వీటితోపాటూ ప్రతిరోజూ అరగంట సేపు వ్యాయామం తప్పనిసరి. టీనేజీ అమ్మాయిలతో పోలిస్తే మహిళల్లో అధిక బరువు తగ్గడానికి చాలా సమయం పడుతుంది. దీనికి కారణం వారిలో ముప్పయి ఏళ్లు దాటాక జీవక్రియల రేటు తగ్గిపోవడమే. దీనికి తోడు హార్మోన్ల అసమతౌల్యం కూడా ఓ కారణం. కాబట్టి ఈ పరిస్థితి ఎదురుకాకముందు నుంచే మేల్కోవాలి. కొత్తగా కసరత్తులు ప్రారంభించేవారు ముందుగా నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. ఆఫీస్‌, ఇల్లూ వాతావరణం, పెరుగుతున్న పనిగంటలూ, అదనపు బాధ్యతలు…ఇవన్నీ సహజంగానే ఒత్తిడికి గురిచేస్తాయి. ఒత్తిడి వల్ల కూడా కొద్దిమంది ఎక్కువగా, కంటికి కనిపించినవన్నీ తినేస్తుంటారు. దాంతో బరువూ పెరుగుతారు. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. అందులో భాగంలో మీకు నచ్చిన ఏదైనా వ్యాపకం పెట్టుకోవచ్చు. నిద్రలేమి వల్ల కూడా బరువు పెరుగుతారు. నిద్ర తగ్గిపోవడం వల్ల అలసటగా, బడలికగా ఉంటుంది. దాంతో తక్షణ శక్తి కోసం కాఫీ, టీలు ఎక్కువగా తాగుతారు. వీటినిలోని చక్కరతో కూడా కెలొరీలు పెరుగుతాయి. కాబట్టి వీటిని తగ్గించి ప్రతిరోజూ కంటి కంటినిండా నిద్రపోవడానికి ప్రయత్నించాలి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com