బాబు లేని అద్భుత బ్యానర్‌తో బలప్రదర్శన చేసిన మోత్కుపల్లి

తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు తన రాజకీయ భవిష్యత్‌కోసం ఈ రోజు ఆలేరులో ముఖ్య అనుచరులతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఆలేరు నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలకు చెందిన తన వర్గీయులతో జరిపే సమావేశంలో ముఖ్య నాయకుల అభిప్రాయాలను సేకరించి, భవిష్యత్‌ రాజకీయ కార్యాచరణ వ్యూహం రూపొందించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆలేరు నియోజకవర్గంనుంచి మూడున్నర దశాబ్ధాలుగా ప్రాతినిధ్యం వహిస్తూ టీడీపీలో రాష్ట్రస్థాయి నేతగా ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు ఆలేరులో బలమైన పట్టుసాధించారు. అయితే ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలతో టీడీపీ అధినేత చంద్రబాబుపై, పార్టీపట్ల అనుచిత వ్యాఖ్యలు, ఆరోపణల నేపథ్యంలో ఆయనపై సస్పెన్షన్‌ వేటువేశారు. అయితే ఆయన అధికార టీఆర్‌ఎస్‌లో చేరడానికి నిర్ణయించుకున్నారని, కాదు ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలనే నిర్ణయంతో ఉన్నారని వస్తున్న ఊహాగానాల మధ్యన ఆలేరులో ఆయన ప్రస్తుతం తెలుగుదేశంలో పార్టీలోనే కొనసాగుతున్న తన వర్గీయులైన ముఖ్య కార్యకర్తలతో ఏర్పాటు చేస్తున్న సమావేశానికి రాజకీయంగా అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. నేడు ఆలేరులోని లక్ష్మీ గార్డెన్ లో నిర్వహించిన ఈసమావేశానికి ఆలేరు నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలకు చెందిన టీడీపీ ముఖ్యనాయకులు, కార్యకర్తలను పెద్దఎత్తున తరలివచ్చారు. అయితే నిన్న మొన్నటి వరకు టీఆర్‌ఎస్‌లో చేరుతారని వచ్చిన ఊహాగానాలకు విరుద్దంగా ప్రజావేదిక ఏర్పాటు చేయడంతో ఇక ఆయన రాబోయే ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం టీడీపీలో ఆయన నాయకత్వం కింద పనిచేసిన రాష్ట్రస్థాయి నుంచి జిల్లా, మండల, గ్రామస్థాయిలో ఎంతమంది నాయకులు పార్టీకి రాజీనామాచేసి ప్రజావేదిక కింద నర్సింహులుతో పనిచేస్తారో.. మరి ఎంత మంది నర్సింహులను విభేదించి పార్టీలోనే ఉంటారనేది ప్రశ్నార్థకం.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com