బాలచందర్ ఆస్తులు వేలం

దర్శకుడు బాలచందర్‌ ఆస్తులను వేలం వేయనున్నట్లు ఓ బ్యాంకు ప్రకటన విడుదల చేయగా.. అది తమిళనాట కలకలం రేపింది. సినీ రంగంలో దర్శక శిఖరమనిపించుకున్న మహా దర్శకుడి ఇల్లు వేలం వేసే స్థితికి దిగజారడం మింగుడుపడడం లేదంటూ ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అలా జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన కుటుంబీకులు వివరించారు. ఈ విషయమై బాలచందర్‌ కుమార్తె పుష్పా కందస్వామి ఒక ప్రకటన విడుదల చేశారు. బాలచందర్‌కు చెందిన కవితాలయా సంస్థ నిర్మించిన టీవీ సీరియల్‌ కోసం ఆయన ఇల్లు, కార్యాలయాన్ని 2010లో యూకో బ్యాంకులో తాకెట్టు పెట్టినట్లు గుర్తుచేశారు. 2015లో సీరియల్‌ నిర్మాణ పనులను రద్దుచేసి డిజిటల్‌ నిర్మాణ పనులు చేపట్టామని, అప్పటివరకు బ్యాంకులో తీసుకున్న రుణంపై అసలుతో పాటు వడ్డీ కూడా కొంతమేరకు చెల్లించామన్నారు. మిగిలిన రుణ మొత్తాన్ని బ్యాంకులో ఒకేసారి చెల్లించేలా చట్ట ప్రకారం చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ సమయంలో బ్యాంకు వేలం ప్రకటన వేసిందన్నారు. అది జరగకుండా తాము అన్ని జాగ్రత్తలు తీసుకొంటున్నామని, ఈ వ్యవహారంతో కలత చెందాల్సిన అవసరం లేదన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com