బాలయ్యకి జడిసి…

సీనియర్‌ నటుడు నందమూరి బాలకృష్ణ.. తన తండ్రి నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్‌గా తానే స్వయంగా నటిస్తూ నిర్మిస్తున్నాడు బాలయ్య. ముందుగా ఈ సినిమాను తేజ దర్శకత్వంలో రూపొందించాలని నిర్ణయించారు. అయితే షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైన తరువాత తేజ ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకోవటం, రాఘవేంద్ర రావు, కృష్ణవంశీ, క్రిష్ లాంటి దర్శకులను సంప్రదించిన ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు నడిపించేందుకు అంగీకరించకపోవటంతో బాలయ్య స్వయంగా దర్శకత్వం వహించాలని నిర్ణయించుకున్నారు. అయితే దర్శకత్వ శాఖలో అనుభవం లేని బాలయ్య సీనియర్‌ దర్శకుల పర్యవేక్షణలో సినిమా చేయాలని భావిస్తున్నారట. ముందుగా ఆ బాధ్యతను దర‍్శకేంద్రుడు రాఘవేంద్ర రావుకు అప్పగించాలని భావించినా.. రాఘవేంద్ర రావు బిజీగా ఉండటంతో మరో దర్శకుడి కోసం ప్రయత్నాలు ప్రారభించారు. తాజాగా ఆ నలుగురు ఫేం చంద్ర సిద్ధార్థ, ‘ఎన్టీఆర్‌’ సినిమాకు దర్శకత్వ పర్యవేక్షణ బాధ్యతలు తీసుకుంటారన్న టాక్‌ వినిపిస్తోంది. ఈ విషయంపై చిత్రయూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com