బాలీవుడ్ కోసం బరితెగింపు

టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఎదిగిన ర‌కుల్ ప్రీత్ సింగ్‌కు ప్ర‌స్తుతం తెలుగులో అవ‌కాశాలు పెద్ద‌గా రావ‌డం లేదు. అటు త‌మిళంలో కూడా చెప్పుకోద‌గ్గ అవ‌కాశాలు లేవు. దీంతో ఈ ముద్దుగుమ్మ ప్ర‌స్తుతం బాలీవుడ్ సినిమాల‌పై దృష్టి పెట్టింది. ప్ర‌స్తుతం ర‌కుల్ న‌టించిన హిందీ సినిమా `అయ్యారీ` విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ప్ర‌స్తుతం ఈ సినిమా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల్లో ర‌కుల్ బిజీగా ఉంది.హిందీలో మ‌రిన్ని అవ‌కాశాలు చేజిక్కించుకునే ప్ర‌య‌త్నాల్లో ఉన్న ర‌కుల్ ఓ మ్యాగ‌జీన్ కోసం చేసిన ఫోటోషూట్‌లో త‌న అందాల‌ను దార‌పోసింది. ఇంత‌కుముందెన్న‌డూ లేని రీతిలో హాట్ హాట్‌గా క‌నిపించింది. `మాగ్జిమ్‌` మేగ‌జీన్ కోసం ర‌కుల్ చేసిన ఫోటోషూట్ ప్ర‌స్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. తెలుగు సినిమాల్లో హీరోయిన్ల‌ను గ్లామ‌ర్ డాల్స్‌గానే చూస్తార‌ని స్టేట్‌మెంట్ ఇచ్చిన ర‌కుల్.. ఇప్పుడు హిందీ సినిమా అవ‌కాశాల కోసం బోల్డ్‌గా క‌నిపించేందుకు సిద్ధ‌మ‌వ‌డం ఆశ్చ‌ర్య‌క‌రం.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com