బాహుసేన

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ చిత్ర బృందం కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. అమరేంద్ర బాహుబలి(ప్రభాస్‌)తో దేవసేన(అనుష్క) ఉన్న స్టిల్‌ను పంచుకుంది. ‘బాహుబలి: ది బిగినింగ్‌’లో దేవసేన పాత్రలో డీ గ్లామర్‌గా కనిపించిన అనుష్క ఈ పోస్టర్‌లో చాలా అందంగా కనిపించారు. అమరేంద్ర బాహుబలితో కలిసి దేవసేన బాణం గురిచూస్తున్న పోజు ఆకట్టుకుంటోంది. ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కించిన ‘బాహుబలి: ది బిగినింగ్‌’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని మరింత పెంచింది. ప్రభాస్‌, అనుష్కతోపాటు రానా, తమన్నా ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి కొనసాగింపుగా రూపొందుతున్న ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ చిత్రం ఏప్రిల్‌ 28న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రం కోసం సినీ ప్రేక్షకులు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com