బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధులతో లోకేష్ సమావేశం

బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ అగ్రికల్చర్ డెవెలప్మెంట్ డైరెక్టర్ నిక్ ఆస్టిన్, ఇతర ప్రతినిధులతో మంత్రి నారా లోకేష్ భేటీ . డిజిటల్ వ్యవసాయంపై చర్చ. లోకేష్ మాట్లాడుతూ టెక్నాలజి అనుసంధానంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి అని లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నాం. రియల్ టైం గవర్నెన్స్ ద్వారా అనేక సేవలు అందిస్తున్నాం. సెన్సార్లు,డ్రోన్లు,ఐఓటి పరికరాల ద్వారా అనేక సేవలు అందిస్తున్నాం. వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా ఉన్నాం. టెక్నాలజీ అనుసంధానం తో వ్యవసాయం లో వృద్ధి సాధించాం. పత్తి పంట వేస్తే నష్టం వస్తుంది అని గుర్తించి పత్తి పంట వెయ్యకుండా అపగలిగాం.రైతులకు నష్టం రాకుండా ముందుగానే జాగ్రత్త పడ్డాం. 13 శాతం వర్షపాతం తక్కువ ఉన్నా వ్యవసాయంలో 24 శాతం వృద్ధి సాధించాం. గ్రామీణాభివృద్ధి లో టెక్నాలజీ అనుసంధానం ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఎల్ఈడి లైట్లను సిసిఎమ్ఎస్ ద్వారా అనుసంధానం చేశాము. నీటి నాణ్యత సెన్సార్ల ద్వారా తెలుసుకుంటున్నాం. బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ తరపున చేస్తున్న అన్ని కార్యక్రమాలు,ఉత్తమ ఆలోచనలు ఆంధ్రప్రదేశ్ లో అమలు చెయ్యాలి. రైస్ ఫోర్టిఫికేషన్ లో సహకారం అందించాలి. చిన్న పిల్లల ఎదుగుదలలో మొదటి వెయ్యి రోజులు ఎంతో ముఖ్యమైనవి. పౌష్టికాహారం లేక అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. దీనిని రైస్ ఫోర్టిఫికేషన్ ద్వారా అధిగమించే అవకాశం ఉంది.అంగన్వాడీ కేంద్రాల్లో ఫోర్టిఫైడ్ రైస్ ఇవ్వడం ద్వారా సమస్యను పరిష్కరించే అవకాశం ఉంది. ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో వ్యవసాయం, విద్యా, వైద్యంలో అనేక నూతన ఆలోచనలు, నూతన ఆవిష్కరణలు చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలిసి పని చేస్తున్నాం. రాష్ట్రంలో మరింతగా మా కార్యక్రమాలను విస్తరిస్తాం. రైస్ ఫోర్టిఫికేషన్ సహకారం అందిస్తాం అని తెలిపారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com