బీరు బొజ్జలకు ఇవి విరుగుడు

పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతే ఆరోగ్యానికి మంచిది కాదు. వంటింట్లో లభించే కొన్నింటితో కొవ్వును సులభంగా కరిగించవచ్చు. అవేమిటంటే..
**నిమ్మరసం
కాలేయంలోని వ్యర్థపదార్థాలను తొలగించడంలో నిమ్మరసం బాగా పనిచేస్తుంది. అందుకే గోరువెచ్చటి నీళ్లల్లో కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి ఉదయాన్నే తాగితే జీర్ణక్రియకు ఎంతో మంచిది.
**అల్లం టీ
అల్లం టీ తాగడం వల్ల శరీర బరువు తగ్గుతారు. ఇది శరీర ఉష్ణోగ్రతను పెంచి కొవ్వును కరిగిస్తుంది. హెర్బల్‌ టీలు కూడా శరీర బరువును తగ్గిస్తాయి.
**బాదంపప్పులు
బాదంపప్పులను రోజూ తింటే పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వు తగ్గుతుంది.. బాదంలోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ శరీరంలో పేరుకున్న ఫ్యాట్‌ని తగ్గిస్తాయి. అందుకే రోజూ రాత్రి పడుకోబోయే ముందర 6-7 బాదం పప్పులను నీళ్లల్లో నానబెట్టి పొద్దున్నే లేచి తినాలి.
**యాపిల్‌సైడర్‌ వెనిగర్‌
ఇది ఆకలిని బాగా తగ్గిస్తుంది. ఒక గ్లాసు నీళ్లల్లో ఒకటి లేదా రెండు టేబుల్‌ స్పూన్సు యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ని వేసి బాగా కలపాలి. అన్నం తినేముందు దీన్ని తాగాలి.
**పుదీనా
పొట్టచుట్టూ ఉన్న కొవ్వును కరిగించడంలో ఇది ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది. గ్యాస్‌ సమస్యను తగ్గిస్తుంది. ఇందులోని యాంటాక్సిడెంట్లు జీవక్రియ సరిగా జరిగేట్టు సహాయపడతాయి. పుదీనా, కొత్తిమీర ఆకుల్ని రెండింటినీ కలిపి బాగా నూరి అందులో నిమ్మరసం వేసి పేస్టులా చేసి చిటికెడు ఉప్పు అందులో కలపాలి. దాన్ని రోటి, ఇడ్లీల్లో చెట్నీగా తింటే జీర్ణశక్తికి ఎంతో మంచిది. పుదీనాలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి.
**కలబంద
ఇది కూడా శరీర బరువును తగ్గిస్తుంది. రెండు టేబుల్‌ స్పూన్ల కలబంద జ్యూసులో ఒక టీ స్పూను ధనియాల పొడి వేసి దాన్ని అరగ్లాసు గోరువెచ్చటి నీళ్లల్లో కలిపి పొద్దున్నే ఖాళీ కడుపుతో తాగితే ఎంతో మంచిది. ఈ డ్రింకు తాగిన గంట వరకూ ఏమీ తినకూడదు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com