బులెట్ ధరలు పెరిగాయి

ప్రముఖ ద్విచక్రవాహన సంస్థ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైకుల ధరలను పెంచింది. ఎనిమిది ప్రముఖ నగరాల్లో పెంచిన ధరల వివరాలను విడుదల చేసింది. ధరలపెంపు రూ.1,100ల నుంచి రూ.3,600 వరకు ఉందని సంస్థ పేర్కొంది. అతి తక్కువగా హిమాలయన్‌పై రూ.1100 పెంచగా అత్యధికంగా క్లాసిక్‌ కోమ్‌ 500పై రూ.3,600 పెంచింది. ధరల పెంపునకు కారణాన్ని మాత్రం ఎన్‌ఫీల్డ్‌ వెల్లడించలేదు. ఉత్పత్తి, ముడిసరుకుల ధరలు పెరగటమే కారణమై ఉంటుందని భావిస్తున్నారు. కొత్త ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయి. ఏడాది కాలంలో ఎన్‌ఫీల్డ్‌ ధరలు పెంచడం ఇది రెండోసారి. ఇటీవల కాలంలో ఎన్‌ఫీల్డ్‌ తన వ్యాపారాన్ని మరిన్ని విభాగాల్లోకి విస్తరించింది. దీంతో హిమాలయన్‌, కాంటినెంటల్‌ జీటీ వంటి ఉత్పత్తులు మార్కెట్లోకి వచ్చాయి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com