బుల్లి గేల్

వెస్టిండీస్‌ ఆటగాళ్లు ఎక్కడ ఉంటే అక్కడ సందడి వాతావరణమే. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌, కింగ్స్‌ఎలెవన్‌ పంజాబ్‌కు ప్రాతినిధ్యం వహించిన డ్వేన్‌ బ్రావో, క్రిస్‌ గేల్‌ ఎంత సందడి చేశారో మనం చూశాం. ‘వి ఆర్‌ ద కింగ్స్‌… చెన్నై సూపర్‌ కింగ్స్‌’ అంటూ బ్రావో డ్రస్సింగ్‌ రూమ్‌లో వేసిన స్టెప్పులు ఎలా మరచిపోతాం చెప్పండి. గేల్ కూడా తన డ్యాన్స్‌తో అడపాదడపా వేదికలపై సందడి చేస్తూనే ఉంటాడు. తాజాగా భారత్‌కు చెందిన విక్కీ కుమార్‌ ట్విటర్లో డ్యాన్స్‌ చేస్తున్న ఓ వీడియోను పోస్టు చేశాడు. ఇందులో గేల్‌ ఓ సందర్భంలో వేసిన డ్యాన్స్‌ను విక్కీ అలాగే వేసేందుకు ప్రయత్నించాడు. ఈ వీడియోను విక్కీ.. గేల్‌కు ట్యాగ్‌ చేశాడు. సామాజిక మాధ్యమాల్లో ఎంతో యాక్టివ్‌గా ఉండే గేల్‌ ఈ వీడియోను చూసి ‘చంపేశావ్’ అని సరదాగా కామెంట్‌ పెట్టాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్‌ పంజాబ్ తరఫున ఆడిన గేల్‌ 11 మ్యాచ్ల్లో 368 పరుగులు చేశాడు. టోర్నీ ఆరంభంలో బాగా ఆడిన పంజాబ్‌ ఆ తర్వాత పరాజయాలు పాలవ్వడంతో ప్లేఆఫ్‌కు అర్హత సాధించలేకపోయింది. ఈ నెలాఖరులో కెనడాలో జరగబోయే గ్లోబల్‌ టీ20 లీగ్‌లో ఆడేందుకు గేల్‌ సిద్ధమవుతున్నాడు. ఇదే లీగ్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు వార్నర్‌, స్మిత్‌ కూడా ఆడుతున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com