బెంగుళూరుకు వాతలు పెట్టిన వీరేంద్ర

క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత టీమిండియా మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ తనదైన శైలిలో పంచ్‌లతో అందరికీ వినోదం పంచుతున్నాడు. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు అతడి ట్వీట్ల కోసం కోట్ల మంది అనుచరులు ఆశతో, ఆసక్తితో ఎదురుచూస్తారన్న సంగతి తెలిసిందే. అరుదైన సందర్భాల్లో తప్ప ఎప్పుడూ కఠినంగా ఉండవు వీరూ ట్వీట్లు. కానీ, క్రిస్‌గేల్‌ శతకం చేసిన సందర్భంలో అతడు చేసిన ఓ ట్వీట్‌ ఆశ్చర్యం కలిగించడంతో పాటు అందరికీ షాకిచ్చింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో కింగ్స్‌ XI‌ ఆటగాడు క్రిస్‌గేల్‌ అజేయ శతకంతో అదరగొట్టాడు. 63 బంతుల్లో 11 సిక్సర్లు, 1 బౌండరీ సహాయంతో 104 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో అతడిదే తొలి శతకం కావడం విశేషం. ఏడాదిన్నర కాలంగా గేల్‌ ఊపు తగ్గింది. గతేడాది ఐపీఎల్‌లో మరీ పేలవంగా ఆడాడు. దాంతో ఈ సారి వేలంలో అతడిని కొనుగోలు చేసేందుకు ఒక్క ఫ్రాంచైజీ సైతం ముందుకు రాలేదు. రెండు సార్లు అలాగే జరిగింది. చివరికి మూడో దఫాలో ప్రీతిజింతా కరుణించి అతడిని కనీస ధర రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది. ఈసారి ఆడిన తొలి మ్యాచ్‌లోనే అర్ధశతకంతో రాణించిన అతడు రెండో మ్యాచ్‌లో ఏకంగా శతకం బాదేశాడు. ఈ నేపథ్యంలో సెహ్వాగ్‌ ప్రతీకాత్మకంగా ఒక ట్వీట్‌ చేశాడు. సెహ్వాగ్‌ ట్వీట్‌ తొలి చిత్రంలో గతేడాది గేల్‌ డకౌట్‌ అయిన్నట్టు ఉంది. ఇక రెండో చిత్రంలో తాజా శతకం సాధించిన విశేషం ఉంది. ఈ రెండు ఫొటోలను పక్కపక్కన పెట్టి ‘అప్పుడు మీరు నన్ను ప్రేమించకపోతే… ఇప్పుడు నన్ను పొందే ….’ అన్నట్టు ఆంగ్లంలో రాశాడు. అంటే ‘నా వైఫల్యాన్ని మీరు ప్రేమించకపోతే ఇప్పుడు నా విజయాన్ని పొందేందుకు మీరు అర్హులు కారు’ అని అర్థం అవుతోంది. ఆ చిత్రం.. మాటలు చూస్తుంటే బెంగళూరుపై ఫెళ్లున చెంపదెబ్బ కొట్టినట్టే అనిపించింది!

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com