బెజవాడలో అమెజాన్ బ్రాంచి

ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌ నవ్యాంధ్రలో కేంద్రం ఏర్పాటు చేయనుంది. ఇప్పటివరకూ హైదరాబాద్ కేంద్రంగా ఈ సంస్థ తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. తాజాగా విజయవాడలోనూ కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆన్‌లైన్‌లో వస్తువులను కొనుగోలు చేసే ఏపీ ఖాతాదారులకు ఈ కేంద్రం ద్వారానే వస్తువులను సరఫరా చేయబోతోంది. ఇప్పటికే 13 రాష్ట్రాల్లో 50 కేంద్రాలను నెలకొల్పిన అమెజాన్‌ ఈ ఏడాది మరో అయిదు కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించినట్లు ఆ సంస్థ ఉపాధ్యక్షుడు అఖిల్‌ సక్సేనా తెలిపారు. సులభతర వాణిజ్యం చేసేందుకు ఏపీ ప్రభుత్వం మంచి ప్రోత్సాహం అందిస్తోందని అందుకే తమ సఫలీకృత కేంద్రాన్ని విజయవాడలో ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com