బెజవాడలో సింహ

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘జై సింహా’. నయనతార కథానాయిక. కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకుడు. సి.కల్యాణ్‌ నిర్మాత. చిరంతన్‌ భట్‌ సంగీతం అందించారు. ఈ చిత్రంలోని గీతాల్ని ఈనెల 24న విజయవాడలో విడుదల చేస్తారు. అదే రోజున ప్రచార చిత్రాన్నీ ఆవిష్కరిస్తారు. సంక్రాంతికి ‘జై సింహా’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘‘ఇటీవల దుబాయ్‌లో బాలకృష్ణ – నయనతార, బాలకృష్ణ – నటాషాలపై చెరో పాటనీ తెరకెక్కించాం. జానీ, బృందా నృత్య రీతులు సమకూర్చారు. బాలయ్య నుంచి కోరుకునే మాస్‌ అంశాలతో పాటు, కుటుంబ బంధాలకూ కథలో చోటుంది. చిరంతన్‌ భట్‌ సంగీతం, బాలయ్యపై తెరకెక్కించిన పోరాట ఘట్టాలు ఆకట్టుకుంటాయి. బాలకృష్ణ – నయనతార కాంబినేషన్‌ మరోసారి ఆకట్టుకోవడం ఖాయం’’ అన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com