బెజవాడ విమానాశ్రయానికి ప్రతిష్ఠాత్మక అవార్డు

నవ్యాంధ్రప్రదేశ్‌కు మకుటాయమానమైన విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి జాతీయ అవార్డు దక్కింది. కన్‌స్ట్రక్షన్‌ ఇండస్ర్టీ డెవల్‌పమెంట్‌ కౌన్సిల్‌ (సీఐడీసీ) విశ్వకర్మ అవార్డ్స్‌ – 2018 కు.. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం ఎంపికైంది. బెస్ట్‌ కన్‌స్ట్రక్షన్స్‌ ప్రాజెక్టు కేటగిరిలో దేశంలోని ఎయిర్‌పోర్టులను వెనక్కినెట్టి ఈ అవార్డును సాధించింది. నీతిఆయోగ్‌ పరిధిలో కన్‌స్ట్రక్షన్‌ ఇండస్ర్టీ డెవల్‌పమెంట్‌ కౌన్సిల్‌ (సీఐడీసీ) పనిచేస్తుంది. ఏటా విభిన్న రంగాలలో పురోగతి సాధిస్తున్న సంస్థలకు సంబంధించి ఈ సంస్థ అవార్డులను ప్రకటిస్తుంది. ఢిల్లీలో రెండు రోజుల కిందట జరిగిన పదవ సీఐడీసీ అవార్డ్స్‌ కార్యక్రమంలో విజయవాడ ఎయిర్‌పోర్టు చీఫ్‌ ఇంజనీర్‌ రామాచారి.. ఎలక్ర్టికల్‌ ఇంజనీర్‌ లోకనాథం ఈ పురస్కారాన్ని స్వీకరించారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇటీవల ఇంటీరియం టెర్మినల్‌ బిల్డింగ్‌తో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. తక్కువ సమయంలో నిర్మాణాలు పూర్తిచేయటంతో పాటు మెగాఇన్‌ఫ్రా దిశగా విస్తరణ తదితర అంశాల్ల్లో ఈ అవార్డుకు ఎయిర్‌పోర్టు ఎంపికైంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com