బెర్లిన్ నుండి అణుసాంకేతికతను తస్కరించిన ఉత్తర కొరియా

ఉత్తరకొరియాకు అణ్వస్త్ర, క్షిపణి తయారీ పరిజ్ఞాననం వెనుక దాగి ఉన్న గుట్టును జర్మనీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ బయటపెట్టింది. అణ్వాయుధ పరీక్షలతో ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తున్న ఉత్తరకొరియాకు అసలా సాంకేతికత ఎలా వచ్చిందన్న ప్రశ్నకు తాజాగా సమాధానం లభించింది. బెర్లిన్‌లో ఉన్న నార్త్‌కొరియా ఎంబసీ నుంచి ఈ టెక్నాలజీని సమకూర్చుకుందని జర్మనీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ చీఫ్ హాన్స్-జార్జ్ మాసెన్ పేర్కొన్నారు. సేకరించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అణ్వాయుధాలు, బాలిస్టిక్ మిసైళ్ల తయారీ కోసం ఉపయోగించుకుంటోందని తెలిపారు. ‘బెర్లిన్ ఎంబసీ నుంచి నార్త్ కొరియా అణ్వాయుధ సాంకేతికతను సేకరించినట్టు మా దృష్టికి వచ్చింది. దీనిని పౌర అవసరాలకు, మిలటరీ అవసరాల కోసం కూడా ఉపయోగించవచ్చు..’ అని మాసెన్ ‌ఎన్డీఆర్ టీవీ చానల్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. సోమవారం ప్రసారం కానున్న ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రోమో విడుదలై సంచలనం సృష్టిస్తోంది. ‘మిస్సైల్ టెక్నాలజీని వారు సొంతం చేసుకుంటున్నారని తెలిస్తే ఆపగలిగి ఉండేవాళ్లమని, అయితే ప్రతిసారీ వాళ్ల ప్రయత్నాలను అడ్డుకోవడం కూడా కష్టమని మాసెన్ అభిప్రాయపడ్డారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com