బొంగు బిరియాని…ఏపీ బ్రాండ్

ఆంధ్రప్రదేశ్‌ బ్రాండ్‌గా బొంగు(బ్యాంబూ) బిర్యానీని ప్రచారంలోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కార్యాచరణ ప్రణాళికనూ సిద్ధం చేశారు. ప్రపంచవ్యాప్తంగా చాలాచోట్ల బిర్యానీ అనగానే హైదరాబాద్‌ను గుర్తు చేసుకుంటారు. అదే స్థాయిలో బొంగు బిర్యానీ అనగానే ఏపీని గుర్తుచేసుకునే స్థాయిలో ప్రమోట్‌ చేయాలని, ఈ బిర్యానీని విస్తృత వినియోగంలో తేవాలని నిర్ణయించారు. ఇందుకోసం హోటళ్లలో పనిచేస్తున్న చెఫ్‌లకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రా ఆహారాన్ని(ఫుడ్‌) ప్రచారంలోకి(ప్రమోట్‌) తెచ్చేందుకు వార్షిక ప్రణాళికను పర్యాటక శాఖ సిద్ధం చేసింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com