బోనీ నాశనం చేశాడు

శ్రీదేవి గుండెల్లో చాలా బాధ ఉండేదని ఆమె దగ్గరి బంధువు వేణుగోపాల్‌ రెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని ఆయన ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. శ్రీదేవి నవ్వు వెనుక చాలా బాధ ఉండేదని చెప్పారు. భర్త బోనీ కపూర్‌ వల్ల ఆమె ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. ‘బోనీ కపూర్‌ సినిమాలు తీసి, చాలా నష్టపోయారని అందరికి తెలుసు. ఆ సమయంలో శ్రీదేవి తన ఆస్తులు అమ్మి, ఆ నష్టాన్ని పూడ్చారు. శ్రీదేవి గుండెల్లో ఎప్పుడూ బాధ ఉండేది. శ్రీదేవి బాధతో జీవించారు, బాధతో కన్నుమూశారు. ఆమెకు ప్రశాంతత అనేదే లేదు. ఈ ప్రపంచానికి ఆమె చిరునవ్వుతో కనిపించే వారు, కానీ లోపల చాలా కుంగిపోయేవారు’. ‘బోనీ తీసిన ఏ సినిమా కూడా పెద్దగా విజయం సాధించలేదు. ఈ నేపథ్యంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. శ్రీదేవి ఆ అప్పులను తన ఆస్తి అమ్మి, తీర్చారు. మళ్లీ మునుపటిలా జీవించడానికి తోడ్పడ్డారు. ఈ కారణంగానే ఆమె మళ్లీ సినిమాల్లో నటించారు’ అని ఆయన చెప్పారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com