బోస్టన్‌లో నాట్స్ ఆహార సేకరణ


బోస్టన్ నాట్స్ విభాగం ఆధ్వర్యంలో బోస్టన్‌లో నిర్వహించిన నాట్స్ ఒన్ మిలియన్ క్యాన్ ఫుడ్ డ్రైవ్ కు విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో 391 కేజీల ఆహారాన్ని సేకరించారు. దీని ద్వారా 650 మందికి భోజనాన్ని అందించే వీలుంటుందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ మొత్తం ఆహారాన్ని మేర్రిమక్ వ్యాలీ ఫుడ్ బ్యాంక్ కు అందించారు. పవన్ వేమూరి నాయకత్వంలో నాట్స్ బోస్టన్ చాప్టర్ ఈ ఫుడ్ డ్రైవ్ చేపట్టగా గౌతం చుండూరు, కల్యాణ్ కాకి, ప్రసాద్ లక్కాల, రాఘవ నన్నూరి, రాజేశ్ పాటిబండ్ల, శ్రీధర్ గోరంట్ల, శ్రీనివాస్ గొండి, సునీల్ కంభపాటి, సునీల్ కొల్లి తదితరులు కార్యక్రమ విజయవంతానికి కృషి చేశారు.


——————————————————————————————————————————————————————————————————————————————————
tags: nats america boston nats boston food drive north american telugu society food drive

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com