బోస్టన్ ప్రవాసుల ఉగాది వేడుకలు

ఏప్రిల్ 14 2018 న నార్త్ బరో అల్గాన్ క్విన్ హైస్కూల్ లో Telugu Association of Greater Boston (TAGB) ఉగాది- శ్రీరామ నవమి వేడుకలకు వెయ్యికి పైగా సభ్యులు విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేసారు. ఎప్పటి లాగే పండగ వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితం చేయటానికి TAGB కార్యవర్గ సభ్యులు ప్రేక్షకులకి ఎన్నో చక్కని ఆహ్లాదకరమైన కార్యక్రమాలను అందించి అలరించారు. కార్యక్రమ ప్రాంగణాన్నిTAGB అలంకరణ బృందం, సంప్రదాయ ఉత్సవ ఆకృతితో పాఠశాల ప్రవేశద్వారం మరియు వేదికను అలంకరించి ఎంతో చక్కగా తీర్చిదిద్దారు. ఉగాది పచ్చడి – పానకంతో సహా సంప్రదాయన్ని అడుగడుగునా ప్రతిబింపజేసే ఎన్నో అనుభూతులు ఆహుతులకి అందించారు. క్వాలిటీ మేట్రిక్స్ కు చెందిన ప్రియాంక వల్లేపల్లి, రియల్ ఎస్టేట్ ఏజంట్ ప్రసాద్ ఆనెం దంపతులు మరియు దేశీ ప్రైం రియాలిటీ అధినేతలు కిరణ్ గుండవరపు, తదితరులు కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు. దేశీ ప్రైం రియాలిటీకు చెందిన కిరణ్ గుండవరపు దంపతులు నాటి వేడుకల కార్యక్రమ స్పాన్సర్లు మరియు దేశీ ప్రైం రియాలిటీ అధినేతలు కిరణ్ గుండవరపు దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసిన పిదప అధ్యక్షురాలు మణిమాల చలుపాది స్వాగత పలుకులతో ప్రారంభమయ్యాయి. చిన్నారులు ఆలపించిన ఆధ్యాత్మిక గానామృతములతో, శ్లోకములు , డాన్సు మెడ్లీల సందడులతో , శాస్త్రీయ సంగీతము మరియు శాస్త్రీయ నృత్య ప్రదర్శనలతో పాటు, కళ్యాణ్ కట్టమూరి గారి “కితకితలు” కామెడి కడుపుబ్బ నవ్వించింది. మహిమ సిలప్పగారి పల్లెల అందాలని చక్కగా వివరించే పాటలు పాడి అందరిని అలరించారు. ఫణి డొక్కా ఉత్తిత్తి అవధానం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అవధాన ప్రక్రియని సరళంగా ప్రేక్షకులకి అర్ధమయ్యేలా హాయిగా సాగిపోయింది. రమణ దుగ్గరాజు దుశ్శలువాతో కప్పగా, శ్రీమతి పద్మ పరకాల పుష్ప గుచ్చం ఇచ్చి మరియు శ్రీనివాస్ కాకి ఙాపిక ఇచ్చి ఫణిని TAGB తరఫున సత్కరించారు. చిన్నారులు, పెద్దలు ఉత్సాహంతో చేసిన వినూత్న కార్యక్రమాలు ప్రేక్షకుల ప్రత్యేక ప్రశంసలు అందుకున్నాయి. బాలలహరి ఆధ్వర్యంలో పద్మజ బాల – శ్రీనివాస్ బాల దర్శకత్వంలో భక్త ప్రహ్లాద నృత్య నాటిక ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది. మన సంస్కృతికి సంబరాలకి ప్రాతినిధ్యంగా నిలచి నాటి కార్యక్రమాలకి వన్నె తిచ్చింది. ఇంత చక్కటి కార్యక్రమాన్ని అందించిన పద్మజ బాలాని సుబ్బు కోట ఇంకా ప్రకాష్ రెడ్డి TAGB తరఫున సన్మానించారు. ఇంచుమించు 9 గంటల పాటు నిర్విరామంగా సాగిన నాటి కార్యక్రమంలో 45 కి పైగా ప్రదర్శనలతో కళాకారులు ప్రేక్షకులను ఉత్తేజ పరిచారు. కార్యవర్గ సభ్యులు సీతారామ్ అమరవాది, రమణ దుగ్గరాజు, పద్మజ బాల, రామకృష్ణ పెనుమర్తి, సత్య పరకాల మరియు దీప్తి గోరా కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. కార్యక్రమాలు విజయవంతం అయ్యాయి అంటే వాటి వెనుక ఎందరో చిన్నారులు, వారి తల్లిదండ్రులు మరియు గురువులు, అలాగే ఎందరో స్వచ్ఛంద సేవకులు మరియు TAGB కమిటీ సభ్యుల ఎన్నో గంటల నిర్విరామ పరిశ్రమ ఫలితమే. వివిధ కళలను ప్రదర్శించిన వారికి, పద్యాల పోటీ లో గెలిచిన వారికి, TAGB కమిటీ వారు ప్రత్యేకాభినందలు తెలియ జేసారు. చిన్నారుల ప్రఙ్ఞా పాటవాలకి పదును పెట్టే పద్యాల పోటీ, పోటా పోటీగా ఉత్సాహంగా గడిచింది. అమెరికాలో వుంటూ ఇంత చక్కగా పద్యాలు చెప్పగలిగిన అతి కొద్ది మంది పిల్లల్లో కొందరిని TAGB ప్రత్యక్షంగా ప్రొత్సహిస్తుంది. TAGB ఆధ్వర్యంలో మొట్టమొదటి సారి ఏర్పాటు చేసిన ఛారిటీ టీం కు విశేష ఆదరణ లభించింది. ఈ బుధవారం 18 ఏప్రిల్ న లోవెల్ సూప్ కిచెన్లో కూడా మన టి.ఏ.జి.బి సామాజిక సేవా కార్యక్రమంతో ఉత్సాహం నింపబోతుంది. గ్రీన్ టీం తరఫున మొదటిసారిగా చలివేంద్రాలు ఏర్పాటుతో “ప్లాస్టిక్ బాటిల్స్” వాడకాన్ని విశేషంగా తగ్గించారు. నాటి సాయంత్రము ప్రదర్శనలతో పాటు ఆవరణలో పెట్టిన అంగడులు కూడా వచ్చినవారిని ఆకట్టుకున్నాయి. ఆనాటి సాయంత్రము మినర్వా రెస్టరాంట్ వారు విచ్చేసిన ఆహుతులకు చక్కని రుచికరమైన భోజనం అందించారు.
బోస్టన్ పరిసర ప్రాంతాల విశేష సాంఘిక సేవ చేసినందుకుగాను మాధవి దోనేపూడి ని టి.ఏ.జి.బి సత్కరించింది. డాక్టర్ హరిబాబు ముద్దన మరియు బాబురావు పోలవరపు పుష్ప గుచ్చం ఇచ్చి, సాయిరాణి మరియు డాక్టర్ అమ్మణి గార్లు దుశ్శలువా కప్పగా మోహన్ నన్నపనేని మరియు శశికాంత్ వల్లేపల్లి ఙాపిక ఇచ్చి TAGB తరఫున సత్కరించారు. TAGB చైర్మన్ శశికంత్ వల్లేపల్లి బీ.ఓ.టి సభ్యుల తరఫున అందరికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసారు. ఎంతో కృషిని , సమయాన్ని వెచ్చించి నాటి వేడుకలను విజయవంతం చేసిన ప్రదర్సకులకు , వారి తల్లితండ్రులకు , విచ్చేసిన ప్రేక్షకులకు , వాలంటీర్లకు, TAGB కార్యవర్గ సభ్యులకు , మరియు దాతలకు , TAGB ప్రెసిడెంట్ మణిమాల చలుపాది ప్రత్యేక అభినందనలు తెలియజేసారు. ఈ కార్యక్రమానికి TAGB సాంస్కృతిక వర్గం సభ్యులు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. చివరిగా TAGB సెక్రటరీ రమణ దుగ్గరాజు ప్రదర్శకులకు,వాలంటీరులకు, TAGB కార్యవర్గ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు.భారత జాతీయ గీతం పాడటంతో నాటి వేడుకలు విజయవంతంగా ముగిసాయి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com