బ్రహ్మకమలం వికసించింది

గరిడేపల్లి శివాలయంలో అరుదైన బ్రహ్మకమలం విరబూసింది. కింగ్ ఆఫ్ హిమాలయన్ ఫ్లవర్‌గా పేరెన్నికగన్న ఈ అరుదైన పుష్పాన్ని చూసేందుకు శివాలయానికి భక్తులు పోటెత్తారు. పలువురు భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. బ్రహ్మకమలం మొక్క పై ఆకులే పువ్వుగా రూపాంతరం చెందుతాయి. ఆ మొక్క ఆకుని నాటితేచాలు అది ఏపుగా పెరుగుతుంది. ఈ మొక్కకు ఏడాదికి ఒకసారి మాత్రమే నాలుగైదు పూలు పూస్తాయి. ఏ అర్ధరాత్రో పూసి రెండు మూడు రోజులకే రాలిపోతాయి. ఆ తర్వాత ఆ మొక్క పూలు పూయడానికి ఏడాది పడుతుంది. ఈ అరుదైన పూలమొక్కలు హిమాలయాల్లో అధికసంఖ్యలో పెరుగుతుంటాయి. ఈ పూలు బ్రహ్మదేవుడి నాభికమలం నుంచి ఆవిర్భవించే రూపంలో ఉండటంతో వీటిని బ్రహ్మకమలాలని పిలుస్తున్నారు. ఈ పూలకు వైద్యగుణంతో పాటు దైవీక గుణాలు మెండుగా ఉన్నాయని వేద పండితులు చెబుతుంటారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com