బ్రిటన్ ప్రధానితో మోడీ భేటీ

మూడు దేశాల పర్యటనలో భాగంగా బ్రిటన్‌లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశ ప్రధానమంత్రి థెరీసా మేతో భేటీ అయ్యారు. లండన్‌లోని 10 డౌనింగ్‌స్ట్రీట్‌లో సమావేశమైన ఇరు దేశాల ప్రధానులు సీమాంతర ఉగ్రవాదం, వీసాలు, వలసలు, ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం గురించి చర్చించారు. అక్రమ వలసదారుల నిరోధం గురించి ఇరు దేశాల మధ్య చేసుకున్న ఒప్పందం గతంలోనే ముగిసిన నేపథ్యంలో ఆ ఒప్పంద పునరుద్ధరణ సహా ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపైనా చర్చించారు. బసవేశ్వర జయంతి రోజున లండన్‌లో ప్రవాస భారతీయులను కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. ఈ సందర్భంగా వారందరికీ శుభాకాంక్షలు చెప్పారు. అంతకుముందు స్వీడన్‌ పర్యటనను ముగించుకొని బ్రిటన్‌ చేరుకున్న మోదీకి బ్రిటన్‌ విదేశాంగ శాఖ మంత్రి బోరిస్‌ జాన్షన్‌ ఘన స్వాగతం పలికారు. నాలుగు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా బ్రిటన్‌లో పర్యటిస్తున్న మోదీ కామన్వెల్త్‌ దేశాద్యక్షుల సమావేశంలోనూ పాల్గొననున్నారు. అనంతరం థెరీసా మే మాట్లాడుతూ.. ప్రజల కోసం భారత్‌తో పరస్పరం కలిసి పనిచేసేందుకు సిద్ధమని ప్రకటించారు. లండన్‌లో ప్రవాస భారతీయులను కలవడం ఆనందంగా ఉందన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com