ప్రవక్త మహమ్మద్‌కు బ్రిటన్ రాణి ఎలిజబెత్ 43వ తరం సంతానమని తాజా అధ్యయనమొకటి ఉద్ఘాటించింది. ప్రవక్త కుమార్తె ఫాతీమా ద్వారా కలిగిన సంతానమనీ, స్పెయిన్‌ను పాలించిన అరబ్ రాజులు ఎలిజబెత్ పూర్వీకులేనని తేల్చింది. ఈ విషయాన్ని తొలిసారిగా 1986లో ఓ ప్రచురణ సంస్థ అధినేత హరాల్డ్ బ్రూక్స్-బేకర్ కూడా నిర్ధరించారు. తాజా చేసిన అధ్యయనంపై చరిత్రకారుడు అబ్దుల్-హమీద్ అల్-అవానీ రాసిన ప్రత్యేక కథనాన్ని మొరాకో పత్రిక అల్-ఒస్బుయ్ ఇటీవల ప్రచురించింది. మొరాకో, అండెలాసియా, ఐరోపాలో పలు సామ్రాజ్యాలను పాలించిన ప్రభువులు ప్రవక్త రక్తసంబంధీకులేనని ఆయన ప్రతిపాదించారు. అదే నిజమైతే- 91 ఏళ్ల బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 మొరాకో రాజు మహమ్మద్-6, జోర్డాన్ రాజు అబ్దుల్లా-2లకు కూడా బంధువు అవుతారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.