భయపడుతున్నారు

రాధికా ఆప్టే పరిశ్రమకు వచ్చిన కొత్తలో లైంగిక వేధింపులను ఎదర్కోవాల్సి వచ్చిందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే తనలాంటి వారు ఇంకా చాలా మంది ఉన్నారని అంటున్నారు రాధిక. కానీ వారి పేర్లు బయటపెడితే ఎక్కడ తమకు అవకాశాలు రాకుండాపోతాయోనని భయంతో చెప్పడంలేదని అన్నారు. ‘జీవితంలో ఎన్నో ఆశలు ఉంటాయి. ఫలానా దర్శకుడు తమతో ఇలా ప్రవర్తించాడు అని చెబితే ఎక్కడ అవకాశాలు రాకుండాపోతాయోనని నోరువిప్పడంలేదు. కానీ అది సరైన పద్ధతి కాదన్నది నా అభిప్రాయం. ఇలాంటి విషయాల్లో మౌనం పనికి రాదు. అలా అని కేవలం చిత్రపరిశ్రమలోనే ఇలాంటి వేధింపులు ఉంటాయని నేను అనడంలేదు. అన్ని చోట్లా ఉంటాయి. లైంగిక వేధింపులను ఆడవారే కాదు మగవారూ ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వాటిని భరించడమే కాదు ఎదిరించడమూ నేర్చుకోవాలి. ధైర్యంగాఉండాలి.’ అని చెప్పుకొచ్చారు రాధిక.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com