భయపెడతా

కథానాయిక నికిషా పటేల్‌ గుర్తుండే ఉంటారు. ఎస్‌.జే సూర్య దర్శకత్వంలో పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటించిన ‘పులి’ సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత కన్నడ, తమిళ సినిమాల్లో బిజీ అయ్యారు. మధ్యలో కల్యాణ్‌రామ్‌ హీరోగా వచ్చిన ‘ఓం 3డీ’ సినిమాలో, సాయిరామ్‌ శంకర్‌తో ‘అరకు రోడ్‌’ చిత్రంలో నటించారు. ఆమె నటిస్తున్న తాజా తమిళ చిత్రం ‘పాండిముని’. కస్తూర్‌ రాజా దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాలో బాలీవుడ్‌ యాక్టర్‌ జాకీష్రాఫ్‌ అఘోరాగా కనిపించనున్నారు. ‘పాండిముని’ ఫారెస్ట్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందే హారర్‌ చిత్రమట. అంటే నికిషా పటేల్‌ అండ్‌ టీమ్‌ థియేటర్స్‌లో ఆడియన్స్‌ను భయపెట్టడానికి రెడీ అవుతున్నారన్నమాట.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com