భలే భలే బబుల్ గేమ్ బుడగలు. ఆ కథ ఏమిటి?

భలే భలే బబుల్‌ గమ్‌… దానిలో కరగకుండా ఉండేదేంటి? దాన్ని వూదితే బుడగలెందుకొస్తాయ్‌? అసలు దాన్ని ఎలా తయారు చేస్తారు? చకచకా చదివేద్దాం రండి!
**తయారీ ఎలా?
చాక్లెట్ల తర్వాత మనకు బబుల్‌ గమ్‌ అంటే చాలానే ఇష్టం. నోట్లో వేసుకుని నమిలేస్తూ, బుడగలు వూదేస్తూ దానితో మనం తెగ ఆటలాడేస్తుంటాం. మరసలు అది ఎందుకు సాగుతుంది? దాంట్లో ఉండే గమ్‌ ఏంటి? మనకస్సలే తెలియదు కదూ. మరింకెందుకాలస్యం తెలుసుకుంటే ఓ పనైపోతుంది.
* సాధారణంగా బబుల్‌ గమ్‌లను తయారు చేయడానికి గమ్‌ బేస్‌ని మూల పదార్థంగా వాడతారు. మనం నోట్లో వేసుకున్నా కరగకుండా కొంచెం కొంచెంగా రుచిని అందించేది ఇదే.
* ఫుడ్‌గ్రేడ్‌ పాలిమర్లని ఉంటాయి. రకరకాల ఖనిజాల నుంచి వీటిని సేకరిస్తారు. రబ్బరు చెట్లలాంటి కొన్ని రకాల చెట్ల నుంచి కూడా వస్తాయి. ఈ మధ్య కాలంలో ప్లాస్టిక్‌, రబ్బరు, సింథటిక్‌ల నుంచీ వీటిని వేరు చేస్తున్నారు.
* వాటికి కొన్ని రకాల కొవ్వులు కలిపితే మెత్తగా ఉండే గమ్‌బేస్‌ తయారవుతుంది. తొందరగా ముక్కలు కాకుండా సాగే లక్షణాన్ని కలిగి ఉంటుందిది. అచ్చుల రూపంలో దొరుకుతుంది.
* అమెరికా, ఐరోపా, ఆసియాల్లో్లని అంతర్జాతీయ పరీక్ష కేంద్రాల్లో దీని నాణ్యతను పరీక్షిస్తారు. దాంట్లో పాసైతే ఇది బబుల్‌ గమ్‌ వాడకానికి అనువైనదని సర్టిఫికెట్‌ వస్తుంది.
* ఈ గమ్‌ బేస్‌లో రంగు, ఫ్లేవర్‌, పంచదార…లాంటి రకరకాల పదార్థాల్ని కలుపుతారు. తయారు చేసే సంస్థను బట్టి ఈ పదార్థాల్లో తేడాలుంటాయి. రుచి ప్రత్యేకంగా ఉండేందుకు వాటి వివరాల్ని రహస్యంగా ఉంచుతారు.
* పెద్ద పెద్ద బ్లేడులున్న యంత్రాలు దాదాపుగా 116 డిగ్రీల సెల్సీయస్‌ ఉష్ణోగ్రత దగ్గర ఈ పదార్థాలన్నింటినీ చాలాసేపు కలియదిప్పుతాయి. ఇప్పుడది చిక్కని ద్రవంలా తయారవుతుంది.
* టూత్‌పేస్ట్‌లో నుంచి పేస్ట్‌ వచ్చినట్లు ఫ్యాక్టరీల్లో ఉండే ఓ రకం యంత్రాలు దాన్ని పొడవుగా పిండుతూ వెళతాయి. అవి చల్లారుతూ, సాగుతూ పల్చటి అచ్చుల్లా యంత్రాలపై పరిగెడతాయి.
* చివరికి మరో యంత్రాలు వాటిని చిన్న ముక్కలుగా కత్తిరించి రేపర్‌తో ప్యాకింగ్‌ చేస్తాయి. కొన్నింటిని కలిపి ఒక పెద్ద ప్యాకింగ్‌ చేసి అట్టపెట్టెల రూపంలో బయటకొస్తాయి. వాటినే మనం దుకాణంలో కొనుక్కుని నోట్లో వేసుకుంటాం.
* సాధారణంగా బబుల్‌ గమ్‌లన్నీ ఈ విధంగానే తయారవుతాయి. అయితే ప్రాంతాల్ని బట్టి ఈ పద్ధతుల్లో చిన్న చిన్న మార్పులుండే అవకాశం ఉంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com