భాజపాను ఎలా ఓడించాలో నాకు బాగా తెలుసు

మహారాష్ట్రకు శివసేనకు చెందిన అభ్యర్థే ముఖ్యమంత్రి అవుతారని ఆ పార్టీ అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే తెలిపారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికల్లోను శివసేన ఒంటరిగానే పోటీ చేస్తుందని ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఓ సభలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అబద్ధాల కోరు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సేన కార్యకర్తలు పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. భవిష్యత్‌లో జరగనున్న ఎన్నికల్లో సేన గెలుపొందేలా కార్యకర్తలు తీవ్ర కృషి చేయాల్సిందిగా ఆయన కోరారు. ‘శివసేన అంటే ఏమిటో దేశమంతా త్వరలోనే చూస్తుంది. రాష్ట్రానికి తదుపరి సీఎం సేన తరఫు అభ్యర్థే అవుతారు. నాతో ఛాలెంజ్‌ చేసిన వారికి ఇది నేను చేసి చూపిస్తాను. భాజపాకు వ్యతిరేకంగా థర్డ్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేసేందుకు సహకరించాల్సిందిగా పలు ప్రాంతీయ పార్టీలు నన్ను కోరాయి. నా తండ్రితో కలిసి పనిచేసిన వారిని (భాజపా) ఎలా ఓడించాలో నాకు తెలుసు. వాళ్లని ఓడించడం ఎలాగో నేను అందరికీ చూపిస్తాను’ అని ఠాక్రే పేర్కొన్నారు. ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌తో చేతులు కలిపేందుకు తాను సిద్ధంగా లేనని పరోక్షంగా చెప్పారు. కొంతమంది మహారాష్ట్రను విడదీసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com