భాజపా “కొడుకుల” పార్టీ కాదు

భారతీయ జనతాపార్టీ కొడుకుల కోసం పుట్టిన పార్టీ కాదని, దేశ నిర్మాణం కోసం పుట్టిన పార్టీ అని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ సోమువీర్రాజు అన్నారు. నంద్యాల రోడ్డులోని శకుంతల కల్యాణ మండపంలో కర్నూలు నియోజకవర్గ క్షేత్రస్థాయి మహాసమ్మేళనం నగర అధ్యక్షుడు యోగానంద చౌదరి అధ్యక్షతన ఆది వారం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన సోమువీర్రాజు మాట్లాడుతూ నేడు రోజుకు 24 గంటల విద్యుత్‌ సరఫరా ఉందంటే అది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పుణ్యమే అని అన్నారు. ఎల్‌ఈడీ బల్బులు ఇచ్చిన ఘనత బీజేపీదేనని, రాష్ట్రానికి కోటీ బల్బులు ఇస్తే మోదీ బొమ్మ కాదని చంద్రబాబు తన బొమ్మను ముద్రించుకోవడం విడ్దూరంగా ఉందని ఎద్దేవా చేశారు. సోలార్‌ పరిశ్రమకు రూ.5 వేల కోట్లు కేంద్రం ఇచ్చిందన్నారు. జీవన్‌ జ్యోతి యోజన కింద రాష్ట్రంలో విద్యుత్‌ సబ్‌స్టేషన్లకు ట్రాన్స్‌ఫార్మర్లు ఇచ్చిందని, ఈ విషయాలను ప్రజలకు తెలియజేయాలని సూచించారు. లక్ష కోట్లతో రోడ్లు, 15 కేంద్ర సంస్థలు, పొదుపు లక్ష్మి గ్రూపులకు రివా ల్వింగ్‌ ఫండ్‌, ఉపాధి పథకం కింద 27 వేల కోట్ల నిధులు కేంద్రం ఇచ్చిందని గుర్తు చేశారు. ఇచ్చి నవి దాచిపెట్టి, ఇవ్వని వాటిని ఎత్తి చూపడం తెలుగుదేశం ప్రభుత్వానికి అలవాటు అయిందని విమర్శించారు. రాష్ట్రంలో పరిపాలన లేదని, వ్యాపారం జరుగుతోందని ఆరోపించారు. రెండు ఎకరాల భూమి ఉన్న వారికి కోట్ల రూపాయలు ఎలా వచ్చాయని పరోక్షంగా ముఖ్యమంత్రిని విమర్శించారు. దేశ ప్రధాని నరేంద్రమోదీకి ఇప్ప టికీ సొంత ఇల్లు లేదని, అనారోగ్యంతో బాధప డుతున్న ఆయన తల్లి ఆటోలో ప్రభుత్వాసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకున్నారని అన్నారు. 2014లో అధికారం చేపట్టగానే పోలవరం ప్రాజెక్టుకు 2019 నాటికి పూర్తి చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పిందని, కర్నూలు జిల్లాలోని గుండ్రేవుల, వేదవతిని మీరు పూర్తి చేయగలరా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాజధానికి రూ.5 లక్షల కోట్లు కావాలంటావు.. రాయలసీమకు లక్ష కోట్లు ఖర్చు పెట్టలేవా అని ఆయన నిలదీశారు. ఆర్గనైజింగ్‌ సెక్రటరీ రవీంద్రరాజు మాట్లాడుతూ ప్రపంచంలోని అతిపెద్ద రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ అన్నారు. దేశానికి ధృడమైన నాయకత్వం ఉందన్నారు. క్షేత్రస్థాయిలో వెళ్లి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర నాయ కుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కే.కపిలేశ్వరయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సందడి సుధాకర్‌, కే.రంగస్వామి, జిల్లా అధ్యక్షుడు హరీష్‌బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏవీ వెంకటసుబ్బారెడ్డి, నగర మాజీ అధ్యక్షుడు మదనమోహన్‌ ఆచారి, నాయకు లు గోపాల్‌రెడ్డి, రామకృష్ణ, నరసింహయ్య తదితరులు పాల్గొన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com