భానుప్రియ మాజీ భర్త మృతి


ప్రముఖ సినీనటి భానుప్రియ మాజీ భర్త ఆదర్శ్ కౌశల్(53) ఆదివారం నాడు మృతి చెందారు. ఆయన లాస్ఏంజిల్స్‌లో తన తల్లి, ప్రముఖ నాట్య గురువు సుమతీ కౌశల్‌తో కలిసి నివసిస్తున్నారు. ఓ ప్రముఖ టీవీ ఛానెల్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా ఆయన పనిచేస్తున్నారు. ఆదర్శ్-భానుప్రియ దంపతులకు అభినయ అనే కుమార్తె ఉంది. స్నానాల గదిలో గుండెపోటుతో కిందపడటంతో సోదరుడు అభిమాన్ 911 అత్యవసర సేవలకు సమాచారం అందించారు. వారు వచ్చి చికిత్స అందించే లోపలే ఆదర్శ్ మృతిచెందారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూలులో ఆదర్శ్ విద్యనభ్యసించారు.


tags: actress bhanupriya husband death dead losangeles sumathi sumathy kaushal bhanupriya husband adarsh kaushal death tnilive tni telugu news international telugu news global telugu news abroad.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com