భారతీయులు ఎవరికైనా బిట్ కాయిన్ పెట్టుబడులు ఉంటే త్వరపడండి

మీరు బిట్‌కాయిన్‌ లేదా ఇతర ఏ క్రిప్టోకరెన్సీలోనైనా పెట్టుబడులు పెట్టారా? అయితే త్వరపడండి.. లేదంటే మరికొన్ని గంటల్లో మీరు మీ పెట్టుబడులను కోల్పోవలసి వస్తుంది. ఎందుకంటే.. బిట్‌కాయిన్‌ ట్రేడింగ్‌ కార్యకలాపాలను నిలిపివేయాలని ఎక్స్ఛేంజీలకు, సంస్థలకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ), కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది. అందుకే బిట్‌కాయిన్‌లో పెట్టుబడులు పెట్టి ఉంటే వెంటనే వాటిని మార్చుకోవాల్సిందిగా నిపుణులు హెచ్చరిస్తున్నారు. బిట్‌కాయిన్‌ కొనడం, అమ్మడం వంటి లావాదేవీలపై ఆర్‌బీఐ విధించిన ఆంక్షలు నేటి అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో బిట్‌కాయిన్‌ను మార్చుకొని ఆ నగదును మీ బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకోలేరు. ఈ నేపథ్యంలోనే బిట్‌కాయిన్‌ లావాదేవీలు జరిపే జబ్‌పే తన వినియోగదారులకు ముందుగానే హెచ్చరికలు జారీ చేసింది. ఆర్‌బీఐ ఇచ్చిన గడువులోపు వినియోగదారులు తమ బిట్‌కాయిన్‌ను నగదు రూపంలోకి మార్చుకోవాల్సిందిగా సూచించింది. పీర్‌ టూ పీర్(పీ2పీ)‌ లావాదేవీలు జరిపేందుకు కొన్ని ఎక్స్ఛేంజీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. వజీర్‌ ఎక్స్‌, కోయినెక్స్‌ లూప్‌ ఈ పీ2పీ లావాదేవీలను చేసుకోవచ్చు. కొనుగోలుదారు, విక్రయదారులే నేరుగా పరస్పరం లావాదేవీలు నిర్వహించుకునేలా ఈ పీటూపీ ట్రేడింగ్‌ సహాయపడనుంది. ఈ లావాదేవీలు జరిగే సమయంలో ఎలాంటి మోసాలు చోటుచేసుకోకుండా ఎక్స్ఛేంజీలు మధ్యవర్తిత్వ ఖాతాగా వ్యవహరిస్తాయి. ఆర్‌బీఐ క్రిప్టో కరెన్సీ, బిట్‌కాయిన్‌ లావాదేవీలు జరగకుండా మాత్రమే నిషేధం విధంచడం వల్ల బ్లాక్‌మార్కెట్‌కు డిమాండ్‌ పెరిగే అవకాశం ఉంది. వినియోగదారులు తమ దగ్గర ఉన్న క్రిప్టోకరెన్సీని ఓఎల్‌ఎక్స్‌ లేదా బ్లాక్‌మార్కెట్‌ ద్వారా నగదు రూపంలోకి మార్చుకునే సదుపాయం ఉంది. బిట్‌కాయిన్‌ లావాదేవీలను నిషేధం విధించడం వల్ల వినియోగదారులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. పేపాల్‌ ద్వారా క్రిప్టోకరెన్సీను డాలర్ల రూపంలోకి మార్చుకొని వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేసుకోవచ్చు. ఇందుకోసం పేపాల్‌ అదనంగా ఛార్జీలను వసూలు చేస్తుంది. ఈ నిషేధం కారణంగా క్రిప్టోకరెన్సీ కంపెనీలు, ఎక్స్ఛేంజీలు రుణాలు పొందలేవు, బ్యాంకుల్లో ఖాతాలను కొనసాగించలేవు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com