భారత్…గొప్ప శక్తిగా అవతరిస్తుంది

త్వరలోనే భారత్ సూపర్ పవర్‌గా మారుతుందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు జోస్యం చెప్పారు. భారత్‌లో యువశక్తి అపారమని, ఐటీలో భారత్ ప్రస్థానం అద్వితీయమని కొనియాడారు. దేశంలో ఇంకా సంస్కరణలు రావాలని, మన ఆలోచనా విధానంలో మార్పు రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. సంస్కరణలను గుడ్డిగా వ్యతిరేకించడం మంచిది కాదని, కేంద్రం బడ్జెట్‌లో వ్యవసాయానికి పెద్దపీట వేశారని వెంకయ్య చెప్పారు. ఎన్నికలు ఒకేసారి వస్తే మంచిదనే చర్చ జరుగుతోందని, దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని, ఏకాభిప్రాయం రావాలని వెంకయ్య వ్యాఖ్యానించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com