భారత్ రానున్న నోకియా ఎక్స్‌ 6

చైనా మొబైల్‌ కంపెనీలకు దీటుగా హెచ్‌ఎండీ గ్లోబల్‌ నోకియా ఫోన్లను తీసుకొస్తున్నా, ధర అధికంగా ఉండటం, ఫీచర్ల విషయంలో కాస్త వెనకబడటంతో ఎక్కువ మంది వినియోగదారులకు చేరువ కాలేకపోతోంది. ఈ నేపథ్యంలో గత నెలలో చైనాలో విడుదలైన నోకియా ఎక్స్‌6 అక్కడ సంచలనం సృష్టించింది. బడ్జెట్‌ ధరలో అద్భుతమైన ఫీచర్లతో విడుదలైన ఫోన్‌కు అక్కడ విశేష ఆదరణ లభించింది. ఈ నేపథ్యంలో నోకియా అభిమానులతో పాటు, టెక్‌ నిపుణులందరూ ఈ ఫోన్‌ భారత్‌కు ఎప్పుడు వస్తుందా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, త్వరలోనే ఈ ఫోన్‌ భారత్‌లో విడుదల చేసేందుకు హెచ్‌ఎండీ గ్లోబల్‌ సన్నాహాలు చేస్తోంది. భారత్‌కు చెందిన నోకియా వెబ్‌సైట్‌లో ఈ ఫోన్‌ దర్శనమివ్వడంతో త్వరలోనే దీన్ని తీసుకురావచ్చని భావిస్తున్నారు. అయితే భారత్‌లో ఎప్పుడు, ఎంత ధరకు ఈ ఫోన్‌ను తీసుకొస్తారనే విషయాన్ని హెచ్‌ఎండీ గ్లోబల్‌ ఇప్పటివరకూ వెల్లడించలేదు. ఫోన్‌ ఫీచర్లతో పాటు, భారత టెలికాం నిబంధనలకు అనుగుణంగా ఫోన్‌ ఉందంటూ యూజర్‌ మ్యానువల్‌లో పేర్కొన్నారు. ఇప్పటికే చైనాలో విడుదలైన ఈ ఫోన్‌ ఫీచర్లు, ధర విషయానికొస్తే మాత్రం.. మార్కెట్‌లో తమ హవా చూపిస్తున్న చైనా మొబైల్‌ కంపెనీలకు ముచ్చెమటలు పట్టేలా ఉన్నాయి. చైనాలో ఈ ఫోన్‌ మూడు వేరియంట్లలో విడుదలైంది. 4జీబీ ర్యామ్‌/32జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఉన్న ఫోన్‌ ధర 1,299యువాన్‌లు(రూ.13,800) కాగా, 4జీబీ ర్యామ్‌/64జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఉన్న ఫోన్‌ ధర 1,499యువాన్‌లు(రూ.16,000) ఇక 6జీబీ ర్యామ్‌/64జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఉన్న ఫోన్‌ ధరను 1,699యువాన్లుగా(రూ.18,000)గా నిర్ణయించారు. ఇక నోకియా ఎక్స్‌ 6 ప్రత్యేకతల విషయానికొస్తే 5.8 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే, 2.5డి గొరిల్లా గ్లాస్‌ 3 ఫినిష్‌తో రానుంది. స్నాప్‌డ్రాగన్‌ 636 ప్రాసెసర్‌, 4జీబీ, 6జీబీ ర్యామ్‌తో పాటు, వరసగా 32జీబీ, 64జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ సదుపాయం ఉంది. మైక్రో ఎస్డీ కార్డు ద్వారా 256జీబీ వరకూ మెమొరీని పెంచుకోవచ్చు. వెనక వైపు 16+5మెగాపిక్సెల్‌ డ్యుయల్‌ కెమెరా సెటప్‌, అద్భుతమైన సెల్ఫీల కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్‌ కెమెరా, ఫేస్‌ అన్‌లాక్‌, ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌లో ఇందులో ఉన్నాయి. 3060 ఎంఏహెచ్‌ బ్యాటరీతో పాటు, క్విక్‌ ఛార్జింగ్‌ 3.0ను ఈ ఫోన్‌ సపోర్ట్‌ చేస్తుంది. ప్యూర్‌ ఆండ్రాయిడ్‌తో ఫోన్లను విడుదల చేస్తున్న హెచ్‌ఎండీ గ్లోబల్‌ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లను ఇస్తూనే ఉంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com