భారత అంధుల జట్టు చేతిలో పాక్‌కు పరాభవం

డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్‌ అంధుల ప్రపంచకప్‌ విజేతగా అవతరించింది. ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ నిర్దేశించిన 308 పరుగుల లక్ష్యాన్ని రెండు వికెట్ల తేడాతో ఛేదించింది. ఛేదనలో సునిల్‌ 93, తెలుగువాడు, సారథి అజయ్‌ రెడ్డి 62 పరుగులు చేశారు. భారత్‌కు శుభారంభం దక్కడంతో 15 ఓవర్లకు వికెట్‌ నష్టపోయి 111 పరుగులతో నిలిచింది. ఐతే వెంటవెంటనే రెండు వికెట్లు చేజార్చుకోవడంతో 16 ఓవర్లు ముగిసే సరికి 116/3తో నిలిచింది. ఈ క్రమంలో సునిల్‌ (93), సారథి అజయ్‌ రెడ్డి (62) ఇన్నింగ్స్‌ భారాన్ని తమపై వేసుకుని పరుగులు సాధించారు. దీంతో 25 ఓవర్లకు భారత్‌ 190/3తో నిలిచింది. వీరిద్దరూ ఔట్‌ కావడంతో ఆట ఉత్కంఠకరంగా మారింది. టీమిండియా టైటిల్‌ నిలబెట్టుకుంటుందా లేదా అని సందేహం కలిగించింది. 35 ఓవర్లకు 271/4తో నిలిచింది. ఆ తర్వాత మిడిల్‌ఆర్డర్‌, టెయిలెండర్లు పోరాడి 38.2 ఓవర్లకే విజయం అందించారు. అంతకు ముందు బాదర్‌ మునిర్‌ అర్ధశతకం, రియాసత్‌ ఖాన్‌ 48, సారథి నిసార్‌ అలీ 47 రాణించడంతో నిర్ణీత 40 ఓవర్లకు 308 పరుగులు చేసింది. పాక్‌ 27 ఓవర్లు ముగిసిన తర్వాత ఐదు వికెట్ల నష్టంతో 200 పరుగుల మైలురాయిని అధిగమించింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్‌ 13న జరిగిన గ్రూప్‌ మ్యాచ్‌లో పాక్‌ను చిత్తుచేసిన సంగతి తెలిసిందే.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com