భారత శక్తికి మోకాలడ్డు

అగ్రరాజ్యం అమెరికా కపట ప్రేమ మరోసారి బయటపడింది! భారత్‌ తమకు నిజమైన మిత్రదేశమని, ఆసియాలో అత్యంత నమ్మకస్తురాలైన భాగస్వామి అని పైకి గొప్పలు చెబుతుంది. ఐక్యరాజ్య సమితి (ఐరాస) భద్రతా మండలిలో భారత శాశ్వత సభ్యత్వానికి పూర్తిగా మద్దతిస్తామని హామీ ఇస్తుంది. తీరా ఆశపడితే వీటో పవర్‌ మాత్రం ఉండదని మెలిక పెడుతుంది. తాజాగా మరోసారి అమెరికా ఇదే పల్లవి వినిపించింది. అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) సభ్యుడిగా మరోసారి ఎన్నికైన జస్టిస్‌ దల్వీర్‌ భండారీకి అమెరికా శుభాకాంక్షలు తెలియజేసింది. ఐరాస సర్వప్రతినిధి సభలో 193 ఓట్లకు గాను 183, భద్రతా మండలిలో 15 ఓట్లు ఆయనకు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో 200 ఏళ్ల పాటు భారత్‌ను పాలించిన బ్రిటన్‌కు తొలిసారి ఐసీజేలో సభ్యత్వం లేకుండా పోయింది. భండారీకి శుభాకాంక్షలు చెప్తూనే అమెరికా ప్రభుత్వ అధికార ప్రతినిధి భద్రతా మండలిలో వీటో పవర్‌ విస్తరణ గురించి వివరించారు. భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశాల సంఖ్యను 15కు పెంచేందుకు సుముఖంగా ఉన్నట్టు అమెరికా తెలిపింది. సంస్కరణలకు ఇష్టమున్నా ప్రస్తుత వీటో పవర్‌ నమూనాలో మార్పు చేసేందుకు వీల్లేదని తేల్చిచెప్పింది. ‘సంస్కరణలు చేసిన మండలి 21వ శతాబ్దం పరిస్థితులను ప్రతిబింబిస్తుందని విశ్వసిస్తున్నాం. ప్రస్తుత సవాళ్లను సమర్థతతో ప్ర‌భావ‌వంతంగా పరిష్కరించేందుకు ఇది అవకాశం కల్పిస్తుంది. వీటో పవర్‌ విస్తరణను మాత్రం మేం వ్యతిరేకిస్తున్నాం’ అని అమెరికా వెల్లడించింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com