భారత షేర్ మార్కెట్లు పరుగు

దేశీయ మార్కెట్లు ఈ వారాన్ని జోరుగా.. హుషారుగా ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో పాటు కంపెనీల త్రైమాసిక ఫలితాలు కూడా ఆశాజనకంగా ఉండటం మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపర్చింది. దీంతో వరుసగా మూడో రోజు సూచీలు లాభాల జోరు కొనసాగించాయి. కొనుగోళ్ల అండతో బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్‌ ప్రతిష్టాత్మక 35వేల మైలురాయిని దాటింది. అటు నిఫ్టీ కూడా లాభాలను సొంతం చేసుకుంది. ఆసియా మార్కెట్ల బలమైన సంకేతాలతో ఈ ఉదయం సూచీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్‌ ఆరంభించిన కొద్దిసేపటికే సెన్సెక్స్‌ 150 పాయింట్లకు పైగా లాభంతో 35వేల మైలురాయిని దాటి పయనించింది. దేశీయ రంగాల షేర్లలో కొనుగోళ్ల అండతో ఒక దశలో 200 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడ్‌ అయ్యింది. చివరకు 191 పాయింట్లు లాభపడి 35,160 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ కూడా 47 పాయింట్ల లాభంతో 10,739 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలో యస్‌ బ్యాంక్‌, టీసీఎస్‌, కొటక్‌ మహీంద్రా, హిందుస్థాన్‌ యునిలివర్‌, ఎల్‌అండ్‌‌టీ షేర్లు లాభపడగా.. యాక్సిస్‌ బ్యాంక్‌, రిలయన్స్‌, యూపీఎల్‌ లిమిటెడ్‌, గెయిల్‌, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ షేర్లు నష్టపోయాయి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com