భారీ లాభాలు చుసిన భారత మార్కెట్లు

భారీ లాభాల్లో మార్కెట్లు.. ఐదు నెలల గరిష్ఠ స్థాయికి చేరిన సెన్సెక్స్!

ఈ వారంలో వెలువడనున్న కార్పొరేట్ కంపెనీల త్రైమాసిక ఫలితాలు
ఉత్సాహంగా ట్రేడింగ్ చేసిన ఇన్వెస్టర్లు
277 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్

దేశీయ కార్పొరేట్ కంపెనీల త్రైమాసిక ఫలితాలు ఈ వారంలో వెలువడనున్న నేపథ్యంలో, ఇన్వెస్టర్లు ఉత్సాహంగా ట్రేడింగ్ చేశారు.

దీంతో, భారతీయ స్టాక్ మార్కెట్లు లాభాలను నమోదు చేశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి…

సెన్సెక్స్ 277 పాయింట్లు పెరిగి 35,935కి పెరిగింది. ఈ నేపథ్యంలో, ఐదు నెలల గరిష్ఠ స్థాయిని టచ్ చేసింది. నిఫ్టీ 80 పాయింట్లు లాభపడి 10,853 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టైమ్ టెక్నోప్లాస్ట్ లిమిటెడ్ (13.11%), హెక్సావేర్ టెక్నాలజీస్ (13.07), ఇండో కౌంట్ ఇండస్ట్రీస్ (8.91), స్టెరిలైట్ టెక్నాలజీస్ (8.62), జిందాల్ సా లిమిటెడ్ (8.26).

టాప్ లూజర్స్:
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (2.71), డెన్ నెట్ వర్క్స్ (2.68), అవంతి ఫీడ్స్ (2.40), ఐనాక్స్ విండ్ లిమిటెడ్ (2.26), ఐసీఆర్ఏ లిమిటెడ్ (2.14).

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com