భారీ లాభాల్లో భారతీయ మార్కెట్లు

దేశీయ మార్కెట్లు బుధవారం లాభాల్లో దూసుకెళ్లాయి. మార్కెట్‌ విశ్లేషకులు ఊహించిన విధంగానే ఆర్‌బీఐ కీలక వడ్డీరేట్లను పావుశాతం పెంచింది. దీంతో బ్యాంకింగ్‌ షేర్లు రాణించాయి. మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో నేటి ట్రేడింగ్‌లో సూచీలు భారీ లాభాలను సొంతం చేసుకున్నాయి. సెన్సెక్స్‌ 250 పాయింట్లకు పైగా లాభపడగా.. నిఫ్టీ 10,650పైన స్థిరపడింది. ఆర్‌బీఐ సమీక్ష నేపథ్యంలో ఈ ఉదయం మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ స్వల్పంగా 50పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్‌ను మొదలుపెట్టింది. అయితే ఆ తర్వాత సూచీలు జోరు పెంచాయి. బ్యాంకింగ్‌, ఆటో, స్థిరాస్తి రంగాల షేర్ల అండతో లాభాల్లో పరుగులు తీశాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 300 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడ్‌ అయ్యింది. చివరకు 276 పాయింట్లు ఎగబాకి 35,179 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ కూడా 91 పాయింట్లు లాభపడి 10,685 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలో ఎయిర్‌టెల్‌, టైటాన్‌, టాటామోటార్స్‌, సన్‌ఫార్మా, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు లాభపడగా.. హిందుస్థాన్‌ పెట్రోలియం, టెక్‌మహింద్రా, సిప్లా, గెయిల్‌, ఏషియన్ పెయింట్స్‌ షేర్లు నష్టపోయాయి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com