భూముల ధర పడిపోవడమనే తర్కం ఏదైతే ఉందో…!

ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్ గుంటూరు జిల్లాలో ప్రజా సంకల్పయాత్ర చేయడం వల్ల రాజధాని రైతుల భూముల విలువ గజానికి 2-3వేల రూపాయలకు తగ్గిపోయిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఈ నెల 21న సీఆర్‌ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాకు సంబంధించి గోడ పత్రికలను మంత్రి ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. అమరావతిని భ్రమరావతిగా పోల్చిన జగన్‌కు అక్కడ పాదయాత్ర చేసినప్పుడే జరుగుతున్న అభివృద్ధి కనపడుతుందని అన్నారు. జగన్ అమరావతికి అనుకూలమా? వ్యతిరేకమా? అని అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండానే జిల్లాను దాటేశారని విమర్శించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com